వంగలపూడి అనితపై దూకుడు పెంచిన మాజీ ప్రొడ్యూసర్..! కోస్తానంటూ కత్తి చూపించి మరీ వార్నింగ్

 

పాయకరావుపేటకి గతంలో ఎమ్మెల్యేగా చేసారాయన. అసలు నందమూరి బాలకృష్ణకి లైఫ్ టర్నింగ్ పాయింట్ లాంటి సినిమాకి ప్రొడ్యూసరాయన. ఆయన పేరు చెంగల వెంకట్రావ్. జూనియర్‌తో నరశింహుడనే వీర బాదుడు సినిమా తీసి నష్టాలపాలైన తర్వాత ఈయనకి బ్యాడ్ టైమ్ బాగా నడిచింది. 2017లో జిల్లా జడ్జి ఈయనకి జీవిత ఖైదు విధించింది.బెయిల్ కోసం నానా తంటాలు పడ్డారు. అలా దాదాపు నాలుగేళ్లు జైలుశిక్ష అనుభవించారు కూడా...!


రెండు రోజుల క్రితం టిడిపి లేడీ లీడర్ వంగలపూడి అనిత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. తమ నేత చెంద్రబాబునాయుడిని అనవసరంగా తూలనాడుతున్నారని..తిడుతున్నారని, ఇలాగైతే ఇకపై ఊరుకోమని అంటూనే ఓ కత్తెరని చూపించి మరీ బెదిరించారు. దీనిపై ఒక్క వైఎస్సార్సీపీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఇతర వర్గాల్లో కూడా విమర్శలు వచ్చాయ్. ఇప్పుడా ఎపిసోడ్‌పైనే చెంగల వెంకట్రావ్ స్పందించారు. మాకూ పౌరుషం ఉందని, తమ నేతలను తిడితే చూస్తూ 

ఊరుకోవడానికి గాజులు తొడిగించుకుని లేమని అంటూ వంగలపూడి అనితకు వార్నింగ్ ఇచ్చారు


వంగలపూడి అనిత చరిత్ర ఏంటో అందరికీ తెలుసని చెప్తూనే, టిడిపి మహిళా విభాగానికి ఇలాంటి నేతని పెట్టే పరిస్థితికి ఆ పార్టీ వచ్చిందంటూ ఎద్దేవా చేసారు. అంతటితో ఊరుకోకుండా, ఓ కత్తిని కూడా చూపించారు. మొత్తానికి ఈ కత్తి, కత్తెరల బెదిరింపులు చూపరులకు, వీక్షకులకు

బోలెడంత వినోదం పంచుతోంది. 

Comments