జనారణ్యంలో ఇలాంటి మృగాలు ఎన్నో..వీడికి లింగచ్ఛేదనే సరైన శిక్ష ! కాదంటారా..!

ఓ ఎమ్మెల్యే కొడుకు తన నియోజకవర్గంలోని వారిని అత్యాచారాలు చేస్తూ పోతుంటే..ఏమీ తెలీనట్లు ప్రభుత్వం బిల్డప్ ఇవ్వడం కరెక్టేనా! 


ఈ కథనం ఎవరి గురించో మీకు అర్ధమయ్యే ఉంటుంది. అసలు పంచాయితీలు చేయడమే తప్పైతే..పైగా అక్కడకు పిలిపించుకుని మహిళలను చెరబట్టాలనుకోవడాన్ని ఏమనాలి..? ప్రాణాలు పోతేనే కానీ స్పందించని ప్రభుత్వాలు ఉంటే  ఎలా..?  ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తెగ

ట్వీట్లు కొట్టుకునే మంత్రులకు, ఎక్కడ ఏం జరిగినా తనకి తెలిసిపోతుందనే ముఖ్యమైన మంత్రులకు ఈ వనమా రోగవేంధ్రగాడి ఉదంతం తెలీదంటే

నమ్మాలా..!


వీడొక్కడు దొరికాడు. దొరకని వాళ్లెందరు..? అసలు ఎమ్మెల్యేలైతే, నియోజకవర్గాలకు దొరలా..! సేవకులం అని ప్రజాప్రతినిధులు చెప్పే మాటలు నీటి మూటలని తేలింది కదా, ఈ నేరస్థుడిపై ఎప్పట్నుంచో 12 కేసులు ఉన్నాయని పోలీసు బాసులే ప్రకటించడం ఏంటి..ఇది చట్టాల్లోని లోపాలే కదా



ఇదే ఓ మామూలు వ్యక్తిపై కేసులు ఉంటే..ఇలా ఉండేదా..అంతెందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై  ఉన్న కేసులకు ఆయన విచారణకు హాజరు కావడం లేదా..? మరి ఈ ఎమ్మెల్యే కొడుక్కి ఏం ఎక్కువని, అలా జనంలోకి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. పైగా ప్రతివాడికీ పార్టీ అండగా ఉండటం లోకల్ ఫీలింగ్ తెచ్చి బెదిరించి బతకడం ఇక్కడి సమాజంలో మామూలైపోయిందంటే తప్పెవరిది..!


ఇదే కేసులోని ఇంకొన్ని కోణాలను  ఇప్పుడెందుకు బయటకు తెస్తున్నారు..సదరు మృతుడు, బాధితుడు నాగరామకృష్ణ కుటుంబం వనమా రాఘవేంద్ర వలనే చనిపోయిందన్నది నిర్ధారించబడిన తర్వాత, ఏం జరుగుతుందని ఆశిస్తారు? ముందుగా అరెస్ట్, ఆ తర్వాత విచారణ..పడితే శిక్ష, కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం వేరు.


నాగరామకృష్ణ సూసైడ్ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఈ కామపిశాచం ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఎలా ఇవ్వగలిగాడు..? వాడేదైనా దేశరక్షణ కోసం

పని చేసిన అండర్‌కవర్ ఏజెంటా..కాదు కదా..! మరి వాడి కోణం చెప్పించడానికి ఈ ఛానల్స్‌కి ఉన్న బాధ్యత ఏంటి..అంత నిప్పుగాడే అయితే అదేదో కోర్టులోనే తేలుతుంది కదా..మరి ఆ తర్వాత ఇతగాడి తండ్రి, పేరుమోసిన ఎమ్మెల్యే గారేం చేసారు..అర్జంట్‌గా ఓ లెటర్ రాసి..పార్టీ పరువు పోతుంది. మేం విచారణకు సహకరిస్తాం అంటూ ఔదార్యం ప్రదర్శించడమేంటి..! బిడ్డా నువ్ సహకించేదేంటి..పోలీసులే బెండు తీస్తారు..నోనో..సోషల్ మీడియానే తీయిస్తుంది. అప్పటిదాకా పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడతాడట..ఛత్..ఇంతకన్నా తెలంగాణ సమాజానికి దౌర్భాగ్యం ఉంటుందా..అంటే ఈ కేసులో వాడి ప్రమేయం ప్రత్యక్షంగా లేదని కోర్టు భావిస్తే..వాడు నిర్ధోషి అవుతాడా..చనిపోయిన కుటుంబం కోరుకున్నది జరగనట్లే కదా..! అసలు వాళ్ల ఆస్థి వ్యవహారంలో తీర్పులు చెప్పడానికి ఈ గొట్టంగాళ్లకి హక్కు ఎక్కడనుంచి ఇచ్చారు ఏ దొరగాడు వీళ్లకి ఇలా పర్మిషన్లు ఇస్తున్నారు..! కనబడితే చెప్పులతో సన్మానం చేస్తేనే కదా, ఎమ్మెల్యేలే కాదు..ఎంపిలు కూడా తాము చేసే లత్కోరు పనులు బైటపడితే, ఇలాంటి అవమానాలే ఎదురవుతాయని భయపడేది..


అబ్బే అదేం జరిగేట్లు లేదుగా..! 


ఇప్పుడు కొత్తగూడెం కోర్టులో 14 రోజుల రిమాండ్ వచ్చింది. ఈ జైలులో ఇతగాడు ఏం చేస్తాడు..కావాల్సినవి తెప్పించుకుని ఎంజాయ్ చేస్తాడు అంతేకదా..! నేరం జరిగిన ఐదారు రోజుల్లో ఏఁ జరిగి ఉంటుంది..పకడ్బందీగా సాక్ష్యాలను..మాయం చేసే టైమ్ దొరికినట్లే కదా..! మరిప్పుడు 

బాధిత కుటుంబం లేదు..ఈ నేరస్థుడి నేరంపై పోరాడేదెవరు..?



 

Comments