మామా అల్లుళ్లు, మాయదారి మల్యా నుంచి 18వేల కోట్లు రాబట్టారా..! సుప్రీంకోర్టులో కేంద్రం వాదనతో షాక్ కొట్టే నిజాలు



 దాదాపు ఆరేళ్ల నుంచి మన దేశానికి చెందిన బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న మాయదారి మాల్యా‌తో బ్యాంకులు గప్‌చుప్‌గా డీల్ సెటిల్ చేసుకున్నాయా అంటే

కోర్టుకి కేంద్రం చెప్పిన సమాధానం వింటే అలానే ఉంది


ఆయనొక్కడే కాదు..పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉట్టి ముంచిన మామాఅల్లుళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు

కూడా పోలీసులకు చిక్కకుండానే మింగిన సొమ్ములు పంపించేసి బైటపడే ప్లాన్‌లో ఉన్నారంటున్నారు


సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రప్రభుత్వం తరపున కోర్టులో దేశంలో పెండింగ్‌లో ఉన్న మనీలాండరింగ్

కేసులు విలువ 67వేల కోట్లుగా చెప్పారు. ఇదే సమయంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీ నుంచి

రూ.18వేల కోట్ల మేర రాబట్టినట్లు కూడా చెప్పారు


జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్ ఆధ్వర్యంలోని బెంచ్ మనీలాండరింగ్ నేరాలను విచారిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్  దేశవ్యాప్తంగా 4700కేసులను దర్యాప్తు చేస్తుందని, గత ఐదేళ్లలో 2015లో 111కేసులు స 2020-21లో 981 కేసులు విచారణకు తీసుకున్నట్లు మెహతా తెలిపారు. 


ఇక అనుమానాస్పదంగా లావాదేవీలు నిర్వహించిన సందర్భంలో ఎఫ్ఐఆర్‌లు నమోదైన వివరాలు తెలిస్తే గుండే గుభేల్మనకతప్పదు.ఏకంగా 33లక్షల కేసులను ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద వివిధ ఏజెన్సీలు బుక్ చేసినట్లు కోర్టుకిచ్చిన నివేదిక ద్వారా తెలుస్తోంది


ఇంత వివరణ ఆయన ఎందుకివ్వాల్సి వచ్చిందంటే..ఈడీ తన పరిధి దాటి ఎంక్వైరీ చేస్తుందని, కేసులు పెడుతుందంటూ కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ సహా 

కొందరు పిల్స్ దాఖలు చేసారు. ఈ సందర్భంలోనే ఈడీ, ఇన్ని కేసులు దాఖలైనా కొన్ని మాత్రమే విచారిస్తుందని తన వాదనకి మద్దతుగా అంకెలను ఉదహరించారు.


ఇక పైన చెప్పిన 18వేల కోట్లు రాబట్టడం అనేది ఆయా నేరగాళ్ల నుంచి రాబట్టిందా లేక, వారి ఆస్తులను విక్రయించి రాబట్టిందా అన్నది మాత్రం తెలియరాలేదు


Comments