భారీ మోసం గురో..! ABG షిప్‌యార్డ్‌లో రూ.22వేలకోట్ల గోల్‌మాల్ గోవిందాలు



 బ్యాంక్ లోన్ తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు..ఐతే అది మనకి మాత్రమే..ఐతే బడాబాబులు కంపెనీలకైతే..ఎదురెళ్లి మరీ అప్పులిస్తారు, ఆ తర్వాత వేల కోట్లకొద్దీ ఎగవేతలకు చోటిస్తారనేది బ్యాంకులపై ఉన్న అతి పెద్ద ఆరోపణ. ఇందులో ఎక్కువ నిజమే ఉంది


తాజాగా ఏబిజి షిప్‌యార్డ్‌ ఛైర్మన్ రిషి కమలేష్ అగర్వాల్ సహా మరికొంతమందిని రూ.22వేల కోట్లకిపైగా అప్పులు తీసుకుని

మోసం చేసిన కేసులో సిబిఐ బుక్ చేసింది. 


స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా కన్సార్టియంకి ఏబిజి షిప్‌యార్డ్ రూ.22842 కోట్ల బకాయి ఉంది. 


ప్రస్తుత ఛైర్మన్ అగర్వాల్, అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సంతానం ముత్త స్వామీ, అశ్వినికుమార్, సుషీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవేటియా సహా మరి కొందరితో పాటు ఏబిజి షిప్‌యార్డ్ ఇంటర్నేషనల్ ప్రవేట్ లిమిటెడ్ పైన సిబిఐ నేరపూరిత కుట్ర,మోసం, విశ్వాసాన్ని కూలదోయడం సహా అనేక అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు పెట్టింది. 


ఎస్‌బిఐ, నవంబర్ 8,2019 ఏబిజి షిప్‌యార్డ్‌పై ఓ కేసు పెట్టింది. దానిపై సిబిఐ మార్చి 12,2020న ఓ క్లారిఫికేషన్ కోరింది. దీంతో ఎస్‌బిఐ 2020 ఆగస్ట్‌లో కొత్తగా మరో కేసు పెట్టింది. అప్పట్నుంచి సిబిఐ ఈ కేసును

దర్యాప్తూ చేస్తూ..ఫిబ్రవరి 7న ఓ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.


ఎస్‌బిఐ ఒక్కదానికే రూ.2468.51 కోట్ల అప్పు ఏబిజి షిప్‌యార్డ్ కట్టాల్సి ఉంది. 2012-17 మధ్యలో

ఇప్పుడు ఎవరెవరిపైనైతే కేసులు పెట్టారో వారంతా కలిసిపోయి, ఓ ముఠాగా ఏర్పడి తీసుకున్న అప్పులను

తమ సొంతానికి దారి మళ్లించేసి తెగ బొక్కేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ తేల్చేసింది. 


దీంతో సిబిఐ తన హిస్టరీలోనే లేనంత పెద్ద స్థాయిలో బ్యాంక్ మోసం కింద దీన్ని నమోదు చేసింది

ఎఫ్ఐఆర్ కట్టింది.  ఏ అవసరాల కోసమైతే ఏబిజి షిప్‌యార్డ్ భారీగా లోన్లను తీసుకుందో..వాటి కోసం కాకుండా వేరే వ్యవహారాలకోసం వాటిని మళ్లించినట్లు ఎఫ్ఐఆర్‌లో సిబిఐ పొందుపరిచింది

Comments