అమ్మయ్య డా.కార్తీక్ ఆపరేషన్ చేశాడు..కానీ కథ ఇంకా సాగదేంటి కార్తీకదీపాలూ..!

 



నేను గత వారం పొరపాటున ఓ ప్రోమో చూసా..అందులో కార్తీకదీపంలో కూతురు హార్ట్ లో హోల్ ఉందని తెలిసి ఏడుస్తున్న హీరోయిన్, హీరో డాక్టర్ కార్తీక్ కన్పించారు. తర్వాత డాక్టర్ కార్తీక్ సర్జరీ చేస్తే కానీ పాప బతకదంటూ మరో డాక్టర్ కామెంట్..కట్ చేస్తే 


రోజూ భోజనం చేసే ముందు ఆ సీరియల్ చూడాల్సి వచ్చింది..ఆదివారం మినహాయించి..సోమ..మంగళ..బుధ గురు..అమ్మయ్య సర్జరీ అయిందనుకున్నా..అదేంటో మరి ఇవాళ కూడా అదే సీన్..అంటే ఇంతకి మించి 

ముందు సాగదా కథ..


మా చిన్నవాడి అన్నప్రాసన జరగనుంది..బహుశా వాడికి ఏడాది వచ్చినా..ఈ సీరియల్

మహా అయితే ఓ అరగంట స్టోరీ ముందుకు వెళ్తుందేమో అన్పిస్తే ఆతప్పు మాది కాదు మరి

చూడబోతే..యర్రంశెట్టిశాయి నవల ఒకటి గుర్తొస్తుంది..అందులో భవానీశంకర్ క్యారెక్టర్ సీరియల్ వెయ్యి ఎపిసోడ్లు ఎలా తీయాలి..అలానే ప్లాట్ లేకుండా..ఓవేళ షూటింగ్ కుదరకపోతే ఓ ఐదారు ఎపిసోడ్లు ఎలా నడిపించాలి..టివి ఛానల్ రేటింగ్స్ ఎలా పెంచాలి అనే థీమ్ తో ఉంటుందా నవలలో


తెలుగు సీరియల్స్ ఇంతగా జనంలో వ్యసనంలా మారితే మారొచ్చు కానీ..వాళ్లబలహీనతను ఇంతగా 

క్యాష్ చేసుకోవాలా..ఇంటింటి గృహలక్ష్మి పేరుతో మరోసీరియల్ వస్తుంది..బహుశా దాంట్లో సీన్లు చాలా 

ఫాస్ట్ గా సాగిపోతున్నాయ్..మరి రేటింగ్ బాగా వస్తుందోలేక ఇలాగే తీయాలని చెప్పారో కానీ..



ఇలాంటి టీవి సీరియళ్లకోసం మనం ఎదురు చూడాలా..?!

Comments