మోదీ అభినవ రామానుజులట..ఆహా..ఏం చెప్పారు స్వామీ..కళ్లు చెమర్చితివి..అంతట నా ఒడలు పులకరించెను మీదుమిక్కిలి జన్మ ధన్యమయ్యెను



 సమతా మూర్తి విగ్రహావిష్కరణ పేరిట పెద్ద టూరిస్టు సెంటర్ ప్రారంభోత్సవం, ఆ మాటున

రాజకీయ సమీకరణాలకు మరో వేదిక సిద్ధం కావడం, వ్యూహంతో గైర్హాజరులు,హాజరులు కూడా జరిగిన ముచ్చింతల్ ముచ్చట్లలో హైలైట్ ఏమిటంటే..రామానుజుల విగ్రహావిష్కరణకు వచ్చిన మోదీగారికి కూడా చినజీయర్ గారు బోలెడంత పొగడ్తమాలలు వేయడం 


అందులో పరాకాష్ట రామానుజులతో మోదీని పోల్చడం

మనకి అభిమానం ఉండటం వేరు..దేవుళ్లతో..దైవదూతలు..అవధూతలతో పోల్చడం వేరు..జగన్ ని గాంధీతో పోల్చినట్లే ఉంది ఈ పోలిక కూడా..


సమాజంలో అసమానతలు తొలగించేందుకు రామానుజులు ప్రయత్నించారని చినజీయర్ తెలిపారు..బానే ఉంది దానికి రాజకీయ నేతలను పోల్చడం సరికాదు..అతిధులను..మన కార్యక్రమాలకు వచ్చిన వారిని ఆనందింపజేయడం కోసం కొన్ని మంచి మాటలు చెప్పడం మామూలే...మరి మోదీగారిని కూడా అలానే పొగిడారనుకోవాలి బహుశా


బహుశా ఈ రీతిన పొగిడింపులు ఉంటాయి కాబట్టే ముఖ్యమంత్రిగారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనేది మరో మాట. ఎందుకంటే రెండు రోజుల ముందే ఆయన కేంద్రప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించి..ఆయన సమక్షంలో ఆయన ఫాలో అయ్యే స్వామివారు అదే ప్రభుత్వ పెద్దలను పొగిడితే సందర్భశుద్ధిగా ఉండదనేది వారి ఆలోచనగా చెప్తున్నారు..


అసలు ఆధ్యాత్మిక కార్యక్రమం మాటున..రాజకీయ సమీకరణాలకే ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయనే విమర్శలు ఎటూ ఉండనే ఉన్నాయ్..అందుకే ఇలాంటి పొగడ్తలకు పెద్దగా ప్రాథాన్యత ఇవ్వక్కర్లేనేది ఇంకొందరి మాట..నిజమేనంటారా..!

Comments