ఏంటో ఈ మాయదారి జొరం ఇప్పుడే రావాలా..! మోదీగారిని కలవలేకపోయా

 అదేందో...నాకు నచ్చనివాళ్లని కలవబుద్ది కాదు..తిట్టిన నోటితోనే..కలిసి షేక్ హ్యాండివ్వాలంటే మా చెడ్డ చిరాకు..

పైగా వచ్చినాయనకి మాకూ లోపాయకారీ ఒప్పందం ఓటి ఏడిసిందని అందరూ అంటుున్నారాయె..దానీ కోసమేనా దూరంగా ఉండాల్సిందే..


పోన్లే ఈసారి  పెక్రతి కూడా నాకు సహకరించుద్ది అప్పటికప్పుడు బోలెడంత నొప్పులు

మాయదారి జొరాలనూ తెచ్చేసుద్ది..కొరోనా కాలంలో ఇట్టాంటి జొరాలే మామూలే


కానీ జొరంపై పడి ఏడవడం కాదు కానీ..ఇప్పుడు మరి జొరం వచ్చిన నేనేం చేయాలి..నన్ను కలిసినోళ్లంతా టెస్టింగులు చేయించుకోవాలని పే...ద్ద పిలుపు ఇవ్వాలా వద్దా...


అలానే నా మటుకు నేను టెస్టింగులు సేయించుకోకపాతే..ఇదెట్టాంటి జొరమే తెలిసేదెట్టా


ఆ ఏముంది రెండు రోజులు ఓపిక పడితే పాయె..తగ్గకపోతే అప్పుడే ముక్కులో పుల్లపెట్టి గెలికించుకుని టెస్టింగుకు పోదాం..ఏటంటారు.



సార్..అంతే సారూ....అంతే అంతే మరి

Comments