టిక్కెట్ల రేట్ల కోసం అట్నుంచి నరుక్కొస్తున్నారా...! కేటీఆర్ ని పిలవడం వెనుక ఆలోచన అదేనా ! అబ్బేం లాభం లేదప్పా..నువ్ సాయంత్రం ప్రగల్భాలకు సిద్ధం గా

 


పురపాలక మంత్రికి సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కి సంబంధం ఏంది..సరే ఉందిపో..ఆయనే అంతా కీలకం..భవిష్యత్తులో సిఎం కూడా అంటున్నారు కాబట్టి ఇప్పట్నుంచే సాగిలపడుతుంటే..మంచి మంచి తాయిలాలు పొందవచ్చనేది మంచి వ్యూహమే..


ఐతే పాపం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటుంది..దానికి ప్రభుత్వం ఉంది..దానిని మా చెంబానాయుడు గారు సిఎంగా ఉంటేనే  అలా గుర్తిస్తాం అనేవాళ్లకి ఇప్పుడు మంచి షాక్ తగిలింది కదా..

మన సరుకులో క్వాలిటీ ఉండి ఏడ్చితే ఆడియెన్స్ ఎలాగైనా వస్తారు..బోడి డబ్బింగ్ సామాన్యుడు సినిమా పై ఎన్ని విమర్శలు చేసారు ఈ రివ్యూ రైటర్స్..అయినా అది మా ఊళ్లో ఇంకా ఆడుతుంది..అంటే సత్తా ఉంటే చాలబ్బా టిక్కెట్ల రేట్లదేముందనేది క్లియర్ గా అర్ధమవుతుంది..కదా..ఐనా సరే 

మా పెట్టుబడి అంతా రెండు మూడు రోజుల్లోనే లాగేసుకుంటాం..తెగ డబ్బు చేసి లావైపోతాం అనేది కదా..ఈ సోకాల్డ్ హీరోల ఇగో..దానిపైనే దెబ్బ కొట్టేసరికి ఇప్పుడు ఈ మంత్రి ద్వారా రాయబారం జరిపించాలనేది ఓ స్కెచ్ గా చెప్తున్నారు..కనీసం ఈ వాదనని 30శాతంమంది నమ్ముతున్నారు..

అయితే అట్నుంచి నరుక్కురమ్మని..కొండవీటి రాజుల సమయంలో ఓ సామెత ఉంది..దొంగలనాయకుడు ఎట్నుంచి నరుక్కు రమ్మన్నా..తన వంతు వచ్చేసరికి మనసు మారుతుందనే దింపుడుకళ్లెం ఆశ నెరవేరలేదు.ఇప్పుడు కూడా డిటోనే అవుతుంది..

ఎప్పటికి అయ్యే పనులు అప్పటికి అవుతాయి తప్ప ఇలాంటి స్కెచ్లతో ఏ పనీ కాదు..

ఐతే సాయంత్రం మన ఫంక్షన్లో ఈరోగారి వీరాలాపాలు మాత్రం బాగా చూడొచ్చు..రెడీగాండి..ప్రగల్భాలకు

Comments