నల్లగా మాడిపోయిన సోమవారం, బ్లాక్ అయిన స్టాక్స్..! మార్కెట్లలో మహా పతనం, ఈ కారణాలతోనే ఇంత నష్టం

 


మార్కెట్లలో మహా పతనం చోటు చేసుకుంది. గత నెల రోజులుగా చోటు చేసుకున్న కరెక్షన్ మరింత ఉధృతమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఖాయమని ప్రచారం జోరందుకోవడంతో..మన మార్కెట్లకు పిచ్చ వణుకు ప్రారంభమైంది. దీంతో ఇంట్రాడేలో ఏకంగా నిఫ్టీ 458 పాయింట్లు నష్టపోయింది. 


సెన్సెక్స్ ఏకంగా 1750 పాయింట్లు నష్టపోయింది. దీంతో ప్రధాన సూచీలు రెండూ 3శాతం వరకూ నష్టపోయినట్లైంది


ఈ దెబ్బతో ఇన్వెస్టర్ల సంపద రూ.6లక్షల కోట్లు హరించుకుపోయింది


బ్యాంక్ నిఫ్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసిజి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ చిత్తడిచిత్తడిగా నేలకి రాలుతుండగా, ఒక్క పిఎస్ఈ, ఐటీ టెక్నాలజీ స్టాక్స్ మాత్రం ఈ ఉత్పాతం నుంచి కొద్దిగా తప్పించుకున్నాయ్. అసలు ఒకటేమిటి చదువరీ, మొత్తం బోర్డు మొత్తం ఎర్రరంగు పులిమేసుకుందంటే అతిశయోక్తి కాదు మరి..!


ఈ దెబ్బతో టాప్ గెయినర్ల లిస్టు మరీ చిన్నబోయింది. టిసిఎస్ 2.30శాం. ఓఎన్‌జిసి 2.20శాతం

లాభపడ్డాయ్. లూజర్లలో జేఎస్‌డబ్ల్యూస్టీల్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, టాటాస్టీల్

5 నుంచి 4శాతం వరకూ నష్టపోయాయ్


ఈ నష్టాలకు కారణాలు

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని..దానికి ప్రతిగా అమెరికా కూడా యుద్ధానికి దిగుతుందనే అంచనాలతో మార్కెట్లు విపరీతంగా స్పందించాయ్

ద్రవ్యోల్బణం కొనసాగుతుందనే అంచనా

క్రూడాయిల్ రేట్లలో పెరుగుదల

Comments