ఈ డీల్ సెట్టైతే పెట్రోల్ పెరగడం కాదు..లీటర్‌కి రూ.10 తగ్గించాలి !



 వరసగా పెట్రోల్ రేటు పెరుగుతూ పోయి సెంచరీ దాటేసింది. అక్టోబర్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామం

కొనసాగుతూనే ఉంది. రష్యా వార్ ప్రభావమా అని క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కి 125 డాలర్లు కూడా దాటేసింది 

ఇప్పుడు క్రూడాయిల్ రేటు 100 డాలర్లకుపైనే సాగుతున్నా

పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈలోపున రష్యా భారతదేశానికి ఇచ్చిన ఓ ఆఫర్ పిచ్చ టెంప్టింగ్‌గా ఉంది



35లక్షల బ్యారెళ్ల ముడి చమురు మన దేశానికి రష్యా అతి చౌకగా ఇస్తామంటూ బేరం పెట్టింది. ఇదే ఇంకో దేశమైతే గెంతులేసి మరీ వెంటనే అంగీకరించేది కానీ, మనది భారతదేశం కదా..ఆచి తూచి స్పందిస్తోంది. ఓ వైపు రష్యా చమురులో ఉక్రెయిన్ రక్తం వాసన రావడం లేదా అంటూ జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇతర దేశాలకు సెంటిమెంట్ దెబ్బ కొడుతున్నారు


ఐనా సరే కొన్ని దేశాలు డీప్ డిస్కౌంట్లలో లభిస్తోన్న రష్యా చమురుని కొంటున్నాయ్. ఇలాంటి నేపథ్యంలో మనం వెంటనే ఈ డీల్‌ని ఓకే చేస్తే మన దేశాన్ని వేలెత్తి చూపడానికి రెడీగా ఉంటారని మన కేంద్రపెద్దలు వెనుకా ముందాడుతున్నారు



సీన్ 1

సపోజ్..పర్ సపోజ్ ఈ డీల్ మనం వద్దన్నామే అనుకోండి..ఏమవుతుంది ఏ పాకిస్తాన్‌కో, శ్రీలంకకో ఇదే ఆఫర్ ఇస్తుంది రష్యా

లీటర్ పెట్రోల్ 250 దాటిందని గుండెలు బాదుకున్న దేశాలు వెంటనే ఈ  ఆఫర్‌ని చేజిక్కించుకుంటాయ్. ఆ తర్వాత పైనెలలో యుద్ధం

ఓ కొలిక్కి రాకతప్పదు( నెలంటే నెలే కాదు..ఇంకో వారంలో అయినా పీటముడి విడిపోవచ్చు).  అప్పుడేమవుతుంది, అన్ని దేశాలు

మళ్లీ తమతమ పనుల్లో పడతాయ్..మనం మాత్రం అర్రర్రే..ఆఫర్ మిస్సైందే అనుకుంటూ వగయవచ్చు


సీన్ 2

ఈ డీల్ ఓకే అంటే, ఏమవుతుంది, కొన్ని దేశాలు ప్రత్యేకించి అమెరికా, యూరోపియన్ దేశాలు మనపై ఆంక్షలంటూ హడావుడి చేయవచ్చు

కానీ, అమెరికా నిన్ననే ఈ ఆయిల్ డీల్ ఆంక్షలని ఉల్లంఘించినట్లు కాదని పేర్కొనడం గమనించాలి


సీన్ 3

రష్యా డిస్కౌంట్ ఆయిల్‌తో మనకి లాభం భారీగానే చేకూరనున్నా..ఇంకో పరిణామం కూడా తలెత్తవచ్చు. అది చైనాలో తిరిగి లాక్డౌన్ పెడుతున్న

తరుణంలో, క్రూడాయిల్ వాడకం భారీగా పడిపోతోంది. అప్పుడిక రేటు కూడా ఏ 80 డాలర్లకో పడవచ్చు. అలాంటి సందర్భంలో మనకి

రష్యా ద్వారా ఒనగూరే డిస్కౌంట్‌తో ధనపరంగా లాభం కాస్త ఒనగూరుతుంది. కానీ ఇన్నాళ్లూ భారత్ శాంతికాముక దేశం, అనైతికంగా

వ్యవహరించదనే పేరు చెడగొట్టుకుందనే విమర్శలు విన్పిస్తాయ్ 


అసలిప్పటిదాకా మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2శాతం మాత్రమే. మన దేశం 176 మిలియన్ టన్నుల చమురు

దిగుమతి చేసుకుంటుంది. మరి ఇందులో 35లక్షల బ్యారెళ్లు ఒకేసారి భారీ డిస్కౌంట్‌తో దొరికితే ఏ దేశమైనా వద్దంటుందా..అందుకే

భారతదేశం కూడా ప్రాక్టికల్‌గా వ్యవహరించబోతున్నట్లు అర్ధమవుతోంది


పైన చెప్పిన డీల్ దాదాపు ఓకే అయిందనే వార్తలు వస్తున్నాయ్. అంత చౌకగా ముడి చమురు దొరికితే, కేంద్రం మరి దాన్ని

వినియోగదారులకు పంపిణీ చేస్తే..లీటర్ పెట్రోల్ ఖచ్చితంగా 10 రూపాయలైనా తగ్గాలి..లెట్స్ వెయిట్ అండ్ సీ

Comments