125 ఏళ్ల యోగి గురించి ఏం చెప్పాలి..ఎంతని చెప్పాలి...! మోదీ ప్రణామం వెనుక ఉన్న ప్రమాణం ఏంటి..వైరల్ అవుతోన్న పద్మశ్రీ స్వామి శివానంద వీడియో

 




నూటపాతికేళ్ల జీవితం అంటే..ఓ చరిత్రని కళ్లముందు తిలకించిన శరీరం అనాలా..! లేక చరిత్ర గతిలో

కలిసిపోయిన ఎన్నో సంఘటనలకు ప్రత్యక్షసాక్షిగా అచ్చెరువునొందాలా.. ? ఎంత జీవితం చూసుండాలి


ఉత్తరప్రదేశ్ లోని కాశీ పుణ్యక్షేత్రంలోని యోగకోటిలో ఒకరైన స్వామి శివానంద వయసు 125ఏళ్లంటారు. ఆయనకి

ఇవాళ పద్శశ్రీ పురస్కారం అందించిన సందర్భంలో చూపరులను ఆకట్టుకునే సంఘటన చోటు చేసుకుంది


పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో స్వామి శివానంద గురించి సంధానకర్త పేరు ఉచ్ఛరించగానే, హాలంతా

చప్పట్లతో మారుమోగిపోయింది. నేరుగా అడుగులో అడుగు కాకుండా..చకచకా అడుగులు వేసుకుంటూ ఓ 

వృద్ధసింహం నడుచుకుంటూ వచ్చింది. 


ఉపరాష్ట్రపతి..ప్రధానమంత్రి..ఆసీనులై ఉన్న వైపు వంగి నేలను తాకి..నమస్కరించి పైకి లేచారాయన

షాక్ తిన్న ప్రధానమంత్రి మోదీ కూడా లేచి..నమస్కరించారు. కానీ కాస్త వంగి చేసిన నమస్కారం. రెండుసార్లు

అలా మోదీ చేసిన తర్వాత, వెంటనే స్వామి శివానంద రాష్ట్రపతి ఉన్నవైపు తిరిగి అక్కడా అదే పద్దతిలో 

నమస్కారం చేసారు. కరతాళ ధ్వనులు మిన్నంటాయా అన్నట్లుగా హాలు అదిరిపోయింది


తిరిగి రాష్ట్రపతి ముందు మరోసారి అదే సీన్ రిపీట్ చేశారు శివానంద. ఈసారి రాష్ట్రపతి తన ఆసనం నుంచి లేచి

ఆయన్ను వారించినట్లుగా పైకి లేపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శివానందకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారం

అందించారు


ఇంతకీ...ఈ నమస్కారం యోగా తెలిసినవారికి శశాంకాసనం వేసినట్లుగా ఉండొచ్చు. లేదంటే మరో ఆసనం గుర్తుకురావచ్చు

కానీ నూటపాతికేళ్ల వయసులో ఆయన ప్రధాని, రాష్ట్రపతికి నమస్కారం చేసి పదవులను గౌరవించారనుకోవాలా...

లేక యోగా పవర్ చూపించారనుకోవాలా..? ఈ యోగసింహ పద్మశ్రీ స్వామి శివానంద ప్రణామం వెనుక అసలు 

అర్ధం ఏంటి..? నెటిజన్లు మాత్రం ఆయన వీడియోని వైరల్ చేస్తున్నారు..!


Comments