ఛానల్ మూతపడుతుందా..ఆ ఎంపికి సిబిఐ సంకెళ్లు? ప్రభుత్వానికి..పార్టీకి వరసదెబ్బలు..మరి వైఎస్ జగన్ స్కెచ్

 


ఇప్పుడు వైఎస్ జగన్‌కి అటు ప్రభుత్వాధినేతగా, పార్టీ లీడర్‌గా 
రెండు రకాలుగా దెబ్బలు తగులుతున్నాయ్. వాటిని అతను ఏ మాత్రం లెక్క చేస్తున్నాడన్నది తర్వాత సంగతి, ముందైతే..రాజధాని అమరావతినే కొనసాగించాలని కోర్టు చెప్పినట్లుగా రెండు మూడు ఛానల్స్ పేపర్స్ 

భాష్యం చెప్తున్నాయ్..


అసలు ఈ తీర్పు ఇలా వస్తుందని తెలిసే, బిల్లు వెనక్కి తీసుకున్నారని ఆల్రెడీ ఓ రోగ్‌రాజు రెండు నెలల క్రితమే

వాక్రుచ్చారు. అంటే ప్రభుత్వం ఈ తీర్పుపై ఏం చేయాలనేది ఓ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది

కొత్తగా తెలిసింది ఏమిటంటే..ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని..దీనికి కూడా కౌంటర్ ప్లాన్ రెడీ


కరోనా టైమ్‌లో నిధులు లేవ్..కేంద్రం ఇవ్వడం లేదు..ఈ రెండు కామెంట్లు చాలు



దీనికి కొనసాగింపుగా రాత్రే ఓ లక్షరూపాయల నిధులు కేంద్రం అమరావతికి కేటాయించినట్లు సదరు పచ్చపత్రికలోనే రాసారు. అంటే అమరావతినే కేంద్రం రాజధానిగా గుర్తించిందనేది వారి ఆనందం..ఐతే ఇక్కడే ఈ నిధుల కేటాయింపుతోనే వైఎస్సార్సీపీ పొలిటికల్ గేమ్ ఆడటం ప్రారంభం అవుతుంది. అదిగో ఆదుకోవాల్సిన కేంద్రమే పట్టించుకోవడం లేదు

ఇక ప్లాట్ల డెవలప్‌మెంట్ ఎక్కడా అని..! 



ఇక పార్టీ పరంగా సమస్యలంటే..సాక్షి ఛానల్‌ని మూసేస్తారంటూ ప్రచారం..ఇది జరగవచ్చు..జరగకపోవచ్చు. జరిగినా, పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఉండదు..ఎందుకంటే, ఆల్రెడీ పార్టీకి బాకా ఊదడానికి మరో బంచ్ ఆఫ్ ఛానల్స్ ఇప్పటికే తమ పని తాము చేస్తున్నాయ్..ఆ మాటికి వస్తే, సాక్షి కంటే ఆ మూడు ఛానళ్లే ఇంకా బహుబాగా బాకా ఊదుతాయ్..


పార్టీపరంగా మరో పెద్ద సమస్య..వివేకానందరెడ్డి హత్య కేసు..ఈ హత్య ఎవరు చేశారనేది మొదటి పదిహేనురోజుల్లోనే తేలిపోయింది

మోటివ్ ఏంటనేది అప్పట్నుంచి ఇప్పటిదాకా తేలనది..120 కోట్ల సెటిల్‌మెంట్ కోసం 40 కోట్లతో సుపారీ ఇస్తారా జరగని పని

ఇక ఎంపి టిక్కెట్ కోసం మర్డర్ చేస్తే..హంతకుడవుతారు కానీ ఎంపి అవుతారా..అందులోనూ..పార్టీ అధినేతకే సదరు హతుడు కంటే ఇతనే ఎక్కువ దగ్గర అన్నప్పుడు ఎంపి టిక్కెట్ తన దగ్గరవారికే ఇస్తాడు కానీ..పరిస్థితిని మర్డర్ దాకా తీసుకుపోరు. 


పోనీ ఆలాగున సింపతీతో ఓట్ల కోసం మర్డర్ పాలిటిక్స్ చేసారనుకుంటే..వివేకానందరెడ్డికి రాష్ట్రస్థాయిలో అంత సీన్ లేదు. వైఎస్సార్ తమ్ముడిగానే పరిచితం..కడప జిల్లా వరకే ఆయన పరిమితం. అంతమాత్రాన ఆయనని తక్కువగా ఏం చూడలేం.



మరి మోటివ్ ఏంటి..ఆజోవేరాకి కూడా ఇదే ప్రశ్న పాపం..ఐతే ఆయన తనకి అనువైన రీతిలో మోటివ్ బైటపడాలని కోరుకుంటాడు..

అశినాశే..మర్డర్ చేయిస్తే..అటు ఎంపి టిక్కెట్ కానీ..సెటిల్‌మెంట్ కానీ కాదు..ఇంకేదో ఉంటుంది  అదే తేలాలి..

మరి ఇతరులైవరైనా చేయిస్తే..వీళ్లంతా ఎందుకు గుండెపోటు నాటకం ఆడతారు..మరకలు ఎందుకు తుడిచేశారు..ఫోటోలెందుకు తీయనీయలేదు

అంతా గుంభనగా ఉంచేసి..పోస్ట్ మార్టమ్ కూడా లేకుండా ఖననం చేసే ప్రక్రియ ఎందుకు చేపట్టారు( సదరు అప్రూవర్, ఇతర నిందితుల మాటలను నమ్మితే) 


ఇంకేదో ఉంది..అది అసలు ఎప్పటికైనా బయటకు వస్తుందా..?


ఇలాంటి చీకాకుల మధ్య వైఎస్ జగన్ సిఎంగా అసెంబ్లీ సెషన్స్‌కి రెడీ కావాలి..ఎలా అవుతాడు..పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు..ఉందిగా..ఎదురుదాడి

దాన్నే పట్టుకుని వేలాడతారు..నో డౌట్


Comments