పాపం పవన్ కల్యాణ్..పదిహేనేళ్లవుతున్నా ఇంకా అదే తీరా..? ఇంకొకడు రోడ్ మ్యాప్ ఇస్తే ముందుకెళ్లడం నాయకుడి లక్షణమా



 వేదికలు ఏవైనా సరే..పవన్ కల్యాణ్ ప్రసంగంలో కొత్తదనం  ఏమీ లేదు. 2014లో ఏవైతే మాటలో..అవే మాటలు..ఇప్పుడూనూ కొత్తగా ఆత్మవిశ్వాసం..సంపూర్ణ విశ్వాసం..ఆత్మగౌరవం అనేపదాలు వాడారు తప్ప అవి ఆయనలో కన్పిస్తాయని నాకైతే అన్పించడం లేదు


ఒక్క మాట...ఒక్కమాట..నేను బిజెపి మాట కోసం  ఎదురు చూస్తున్నా..అది అక్కడ్నుంచి రాకపోతే..నేనే మొదలుపెడతా అనే దమ్ములేని లీడర్ రాష్ట్ర రాజధాని( రాష్ట్ర) బాధ్యత తీసుకుంటా అంటే నమ్మడం సాధ్యమేనా..? 


పాతికేళ్ల రాజకీయంలో అప్పుడే పదిహేనేళ్లు గడిచిపోయాయ్ పవన్ బాస్..


పైగా ఈయన సభలకి వచ్చే జనాలను చూసి భయపడాలా

2014కి ముందు జగన్ సభలకి, యాత్రలకు వచ్చిన జనం కంటే ఎక్కువ ఎవరికైనా వచ్చారా..అప్పుడు జగన్ గెలిచాడా..లేదు 2019లో పవన్ కల్యాణ్ గారి సభలకి జనం తక్కువ వచ్చారా..ఇప్పుడు మాత్రం ఓ...అని రాగానే వైఎస్సార్సీపీ లీడర్లలో భయం  కన్పిస్తుందంట..వార్నాయనో...ఇంకా నయం నిద్ర లేకుండా

తిరుగుుతన్నారని చెప్పలే



రాసుకొచ్చిన స్క్రిప్ట్‌ని భావయుక్తంగా కాకుండా..రంకెలు వేసి చెప్పడమే రాజకీయ ప్రసంగమా /?ఇంతకీ ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలిపోకూడదని..కలిసి వచ్చే పార్టీలంటే ఏవి సారూ...బిజెపి ఆల్రెడీ మీ దోస్తే ఇక టిడిపి, కాంగ్రెస్..లెఫ్ట్ పార్టీలా..అంటే సెంటర్‌లో మోదీపై పోరాటానికి 2019లో  అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినట్లు చేస్తారా...?


మీరనే రోడ్ మ్యాప్ ఇచ్చే బిజెపినే..ప్రత్యేక హోదా ఇవ్వాలి..ఆ  పార్టీనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతోంది

ఆ పార్టీనే..పోలవరాన్ని పూర్తి చేయాల్సింది..ఇలాంటి మూడు పవర్ ఫుల్ అస్త్రాలను పూర్తి చేయగల బిజెపి

ఆ పని చేయకపోతే..దానికి వైఎస్సార్సీపీని తిడితే లాజిక్ మిస్సై జనం మరోసారి మిమ్మల్ని ఇళ్లకే పరిమితం చేస్తారు



సర్...దయచేసి దమ్ము చూపించండి..సొంతంగా బరిలో దిగండి..లేదంటే సత్తా ఉన్న సీట్లలోనే పోటీ చేసి..పవర్ చూపండి..

175 సీట్లూ పోటీ చేసి గెలవాలనే రూలేం లేదు..ఖచ్చితంగా గెలిచే 85సీట్లే పోటీ చేయండి..దానికి పోయి..బిజెపి రోడ్ మ్యాప్  ఇస్తుందని

ఆశిస్తున్నా...అనడమేంటి..ఓ వేళ అది ఇవ్వకపోతే..మీరు అలానే ఆశిస్తూనే ఉంటారా..! 

కనీసం కొంతమందైనా మీ వెనుక ఉంటారు..లేకపోతే..ఈ వెర్రి అభిమానులే

మీ వెంట లక్షల్లో కేకలు వేస్తూ..ఓట్లు మాత్రం ఇతర పార్టీలకు వేస్తారు


Comments

  1. Chala bagundhi sari na inla chestha undu

    ReplyDelete
  2. "చట్టసభల్లో ఇచ్చిన మాటకే విలువ లేకపోతే ఎలా?" అని భజన సేనాని ప్రశ్నించాడు. ఇదే మాట మోడీని ప్రశ్నించలేని లేదా చాతకాని పవన్ కల్యాణ్ ఒక మానసిక రోగి అని నాకనిపిస్తుంది.

    >>మీ వెంట లక్షల్లో కేకలు వేస్తూ..ఓట్లు మాత్రం ఇతర పార్టీలకు వేస్తారు

    అస్సలు వల్లల్లో ఓటుహక్కు ఎంతమందికుంది? అందుకే.. రాల్లెయ్యడానికి పరిగెత్తుకొచ్చే జనసైకోలు.. పోలింగులదగ్గర కనిపించరు.

    ReplyDelete

Post a Comment