తలా ఈజ్ బ్యాక్..! అద్భుతమైన ఆఫ్ సెంచరీతో కేక పుట్టించిన ధోని, ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కి కూడా బ్యాట్ మార్పు





 ఎన్నాళ్లకి..ఇదీ ధోని అంటే అనేలా రెచ్చిపోయాడు

మిస్టర్ కూల్ అని తనని ఎందుకంటారో..మరోసారి చూపించాడు


ఐపిఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రవీంద్రజడేజాకి వదిలిపెట్టిన ధోని..ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆఫ్ సెంచరీ చేసాడు


చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో చూస్తే రన్ రేట్ 4.85 కానీ...20 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 దాటేసింది

దీనికి కారణం, రవీంద్ర జడేజాతో కలిసి మహేంద్ర సింగ్ ధోని నిర్మించిన సూపర్ పార్ట్‌నర్ షిప్.


38 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేయడమే కాకుండా నాటౌట్ గా నిలిచాడు ధోని. దీంతో టీమ్ రన్స్ 131గా నిలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు

132 రన్స్ టార్గెట్ పెట్టారు. 


ఈ ఇన్నింగ్స్‌తో ధోని 28వ టి20 ఆఫ్ సెంచరీలు చేయగా, ట్విట్టర్ అంతా ధోనికి పొగడ్తలు చెప్తూ ఊగిపోయింది


అన్నిటికంటే ఆకట్టుకునే మరో అంశం..19.5 బంతుల వద్ద ధోని బ్యాట్ మార్చడం..అంటే ఒక్క బంతి కోసమే కదా మిగిలింది అనుకోకుండా

రాజీపడని అతని తత్వమే ధోనికి కోట్లాదిమంది అభిమానులను తెచ్చిపెట్టింది. 


Comments