పాట వినండి మిమ్మల్ని వెంటాడకపోతే అడగండి..రెండోసారి వింటే మూడోసారి చెప్పక్కర్లేదు

 


కలియుగ దైవం శ్రీ వేంకటేశునిపై ఇప్పటికి ఎన్నో లక్షల గీతాలు వచ్చాయి. వస్తాయి కూడా..అలాంటి వాటిలో ఒకటి నమో వేంకటేశాయ అంటూ తెలుగు సంగీత దర్శకుడు శివప్రసాద్ స్వరపరచిన ఓ గీతం ఆకట్టుకునే రీతిలో సాగింది. వర్ధమాన గాయని తుషార నిలయ ఈ భక్తిగీతానికి అభినయించగా, గ్రాఫిక్ వర్క్ నీట్‌గా చేశారు



పదే పదే విన్పించే డ్రమ్స్ ( కుండలపై తాళం వేస్తే వచ్చే స్వరం) అలానే పాట చరణం పల్లవి అంతా మనల్ని హంట్ చేస్తుంటాయ్


అలానే స్వాతికిరణంలోని తెలిమంచు కురిసింది తలుపు తీయనా..ప్రభూ..అనే పాట కూడా మీకు మదిలో తలంపుకు రావచ్చు


వేంకటేశునిపై వీనులవిందైన భక్తి గీతం (- క్లిక్ చేయండి లింక్ని)


బూడిద వర్ణం తిరునామాలపై ప్రసరించడం..ఆ తర్వాత విగ్రహంపైన మేఘాల్లా అల్లుకుపోవడం చక్కగా ఉంది.ఐతే పాట మధ్యలో వాడిన తిరుమల శ్రీనివాసుని ఫోటోలు మాత్రం పాట స్థాయికి తగినట్లుగా లేవు.( నా అభిప్రాయం మాత్రమే)

దేదీప్యమానంగా వెలిగిపోయే ఏడుకొండలవాడంటే..మనకి ఠక్ మని గుర్తొచ్చే దివ్యమంగళ స్వరూపమే ప్రత్యక్షమవుతుంది కానీ, ఇతర విగ్రహాలు అంతగా ఆకట్టుకోవు



మొత్తం మీద ఈ భక్తిగీతం తిరుమల భక్తులకు కన్నులపండగ వీనుల విందుగా చెప్పాలి

మీరూ ఈ లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి


ఏడుకొండలవాడిపై కమ్మని భక్తి గీతం



Comments