హహహహ....లోకేశ్ అంటే భయమా...వామ్మో వెంకన్నో ఇదేంది...ఇంత జోకా

 మహానాడు బంపర్ సక్సెస్...తప్పేంలేదు ...అంత జనం చూసి చాలా రోజులైంది కాబట్టి టిడిపి దానికి సంబరపడితే తప్పేం లేదు..ఐతే మహానాడు అంతా లోకేశ్ గొప్పదనమంటూ కీర్తించడం మాత్రం చాలా తప్పు...అంచనాలు వేయడంలో విఫలమైనట్లే


దీినికి తోడు బుద్దా వెంకన్నలాంటోరు... "అసలు వైఎస్ జగన్ రెడ్డి గారు మీరు, లోకేశ్ అంటే ఎందుకు భయపడుతున్నారు..ఎందుకంత భయం "అంటూ ఇవాళ వీరాలాపాలు చేయడం మాత్రం చాలా హాస్యాస్పదం 


ఈ రోజుకు డైరక్ట్ గా ఓ ఐదు నిమిషాలు తప్పులు లేకుండా మాట్లాడలేని మన లోకేశం గారికి..పరాజయం నుంచి కోలుకుని తిరిగి ప్రభంజనంలాగా గెలిచిన జగన్కి పోలిక పెట్టడమే తప్పు..


విజయమే ప్రతిదానికి పరమావధి..పారామీటర్ అంటే..అప్పుడు జగన్ నంబర్ వన్..

లేదూ ఇంకేదైనా పోలిక తీసుకువస్తే, దానిలో కూడా ఇద్దరిలో పోటీ పెట్టడం కాదు..అసలది కామన్ ప్లాట్ ఫామ్ కానే కాదు..బలవంతంగా లేదు లేదు ఇద్దరూ ఒక స్థాయే అంటే ఎవరు చేయగలిగింది లేదు..తండ్రి తీసుకున్న పార్టీలో, తాత ప్రారంబించిన పార్టీలో వెలగడం తప్ప..సొంతంగా లోకేసం గారు ఇరగదీసిందేదో చూపించాలి..అంతేకానీ ఊరికే...మా చినబాబుని తెగ తిట్టారు..విమర్శించారు అంటే జనంలో చులకన అవడం తప్ప వేరేదేం లేదు..అంతెందుకు..చినబాబునే సిఎం కాండిడేట్ గా ప్రచారం చేయండి చూద్దాం వెంకన్నగారూ..పదవిలో ఉన్నప్పుడు పొగడటం కాదు..ఇప్పుడు పొగడండి కాబోయే సిఎం లోకేశ్ అని !

Comments