బిగ్‌బుల్ హోల్డింగ్స్ 32 స్టాక్స్-32000క్రోర్స్, ఏ స్టాక్‌లో ఎంత హోల్డింగో తెలుసా..?




 రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా చనిపోయేనాటికి ఆయన ఆస్తుల విలువ రూ. 43800 కోట్లుగా లెక్కగడుతున్నారు .అలా దేశంలోని కుబేరుల జాబితాలో 36వ వ్యక్తిగా ఆయన నిలవడం జరిగింది. 

లేటెస్ట్ డేటా ప్రకారం, రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్ట్‌ఫోలియోలో 32 స్టాక్స్ ఉండగా వాటి నెట్వర్త్ రూ.31904.80 కోట్లుగా తేలింది

మొత్తం ఆయన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మూడోవంతు టైటన్‌లోనే పెట్టారు. భార్య రేఖతో కలిపి టైటన్ ఇండస్ట్రీస్‌లో రాకేష్‌కి 5.05శాతం వాటా ఉంది వాటి విలువే రూ.11086.90కోట్లు. దాని తర్వాత ఆయనే ప్రమోట్ చేసిన  స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.7017.50కోట్లు, మెట్రో బ్రాండ్స్‌లో రూ.3348.80 కోట్ల విలువైన షేర్లున్నాయ్. 


స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 17.49శాతం వాటా

మెట్రో బ్రాండ్స్‌లో 14.43శాతం వాటా 

టాటా మోటర్స్‌లో 1.09శాతం( 36,250,000 షేర్లు)-రూ.1731.10కోట్లు

క్రిసిల్‌లో 5.48శాతం వాటా ( 40,00,000 షేర్లు)-రూ.1301.90 కోట్లు

ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 4.2శాతం వాటా-రూ.898.90 కోట్లు

ఫెడరల్ బ్యాంక్‌లో 3.6శాతం వాటా-రూ.839కోట్లు

కెనరా బ్యాంక్‌లో 2శాతం వాటా -రూ.825.50 కోట్లు

ఇండియన్ హోటల్స్‌లో 2.1శాతం వాటా-రూ.816.30 కోట్లు


NCCలో 12.6శాతం వాటా- రూ.505.20కోట్లు

ర్యాలీస్ ఇండియాలో 9.8శాతం వాటా-రూ.428.80కోట్లు

నజారా టెక్నాలజీస్‌లో 20శాతం వాటా-రూ.423.50కోట్లు

జూబ్లింట్ ఫార్మావోలో 6.8శాతం వాటా-రూ.372.20కోట్లు

జూబిలంట్ ఇన్‌గ్రేవియాలో 4.8శాతం వాటా-రూ.358.70 కోట్లు

టాటా కమ్యూనికేషన్స్‌లో 1.1శాతం వాటా-రూ.336.60కోట్లు


ఎస్కార్ట్స్ కుబోటా, కరూర్ వైశ్యా బ్యాంక్, యాప్‌టెక్ ఆగ్రోటెక్ ఫుడ్స్, వా టెక్ వాబాగ్, కంపెనీల్లో కూడా బిగ్‌బుల్‌కి రూ.125 కోట్ల నుంచి రూ.300కోట్లు విలువైన వాటాలు ఉన్నాయ్. 


ఇవి కాకుండా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వోకార్డ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అనంత్ రాజ్, డిష్‌మాన్ కార్బోజెన్, మన్ ఇన్‌ఫ్రా, ఓరియంట్ సిమెంట్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, బిల్‌కేర్, ప్రొజోన్ ఇంట్యు ప్రాపర్టీస్ కంపెనీల్లో కూడా వాటాలుండగా వాటి విలువ ఒక్కో దానిలో 

రూ.100కోట్లలోపే ఉంటుంది

Comments