బిగ్‌బుల్ లేని మార్కెట్లను ఊహించడం ఎలా..? సింక్ కాని ఓ నిజం

 


రాకేష్ ఝన్‌ఝన్‌వాలా..ఇక ఈ పేరుని మనం వార్తల్లో వినబోం..అప్పుడే ఆయన చనిపోయి సగం రోజు గడుస్తోంది. ఇన్వెస్టర్లకు ఇకపై స్టాక్ మార్కెట్లలో ఓ బ్లంట్ గైడ్ కన్పించరు. ఎవరు ఏ స్టాక్ కొంటే ఆ కంపెనీ షేర్లపై దండయాత్రలాగా ట్రేడర్లు పరుగులు పెడతారో..ఇక ఆ టార్చ్ బేరర్ కన్పించరు..!

 

మనుషులతో కాలం ఆగిపోదు..అది సృష్టించే సంపద తరిగిపోదు కానీ..ఇంకో రాకేష్ ఝన్‌ఝన్‌వాలా మాత్రం పుట్టడు..అతను వేలు ఎటువైపు చూపిస్తే అటు సాగిపోయే ఇన్వెస్టర్లకు ఇప్పుడు అదో పెద్ద లోటు. ఇది రాస్తున్నప్పుడో

చదువుతున్నప్పుడో వెంటనే అతిగా అనిపిస్తుంది. కానీ మనం కొన్న స్టాక్ రాకేశ్ కొని ఉన్నాడంటే..అదో భరోసా

లేదూ ఆయన హోల్డింగ్స్‌ని ఫాలో అయి కొనుగోలు చేసినవాళ్లకి  ఓ నమ్మకం..అలాంటి స్టాక్స్ పరిస్థితి ఏంటిప్పుడు

 

కెనరాబ్యాంక్ గురించి అనలిస్టులు ఎంతైనా చెప్పొచ్చు..కానీ ఆయన చేయి పడిందనగానే అదో మిడాస్ టచ్

కరూర్ వైశ్యా బ్యాంక్ పరిస్థితి కూడా అంతే, లేదూ ఫెడరల్ బ్యాంక్ సిచ్యుయేషన్ కూడా  అదే, ఎంతకీ పెరగవేం

అని అసహనంగా మాట్లాడేవాళ్లకు.." ఈ క్వార్టర్‌లో కూడా బిగ్ బుల్ అమ్మలేదట..ఆయనంత తేలిగ్గా మోస్తాడా ఏంటి

ఏందో విషయం ఉండే ఉంటుంది గురూ.. ! " అని చెప్పుకునేవాళ్లకు తక్కువలేదు

 

అలానే కోట్లకి కోట్లకు కురిపించిన టైటన్ ఇండస్ట్రీస్ , ఆయనకి ఫేవరెట్ స్టాక్. ఎంత నష్టం వచ్చినా భరించాడాయన

రీసెంట్ క్వార్టర్‌లో కనకవర్షం కురిపించినా టైటన్‌ని అమ్మలేదు.

 

మెట్రో బ్రాండ్స్ కానీ..స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ప్రమోట్ చేసినప్పుడూ అదే ధైర్యం, లిస్టింగ్ టైమ్‌లో నష్టపోయినా

లాంగ్ టర్మ్‌లో ఢోకా లేదని చెప్పాడాయన.  అలానే జరిగింది కూడా, ఇక గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్ కూడా

నజరానా అందిస్తుందని రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా నమ్మారు..రిజల్ట్ సేమ్.

 

టాటా మోటర్స్ రాకీ భాయ్ పోర్ట్‌ఫోలియోలోని మరో టాటా గ్రూప్ కంపెనీ.  ఫోర్టిస్ హెల్త్ కేర్, ఇండియన్ టెక్నాలజీస్

జూబిలంట్ ఫర్మావో, టాటా కమ్యూనికేషన్స్, జియోజిట్, వోకార్డ్, డిష్ మాన్ ఫార్మా, ఓరియంట్ సిమెంట్, ప్రోజోన్ ఇంట్యూ ప్రాపర్టీస్ కూడా ఆయన అమ్ములపొదిలో అస్త్రాలే.  అయితే ఇవన్నీ కూడా అందరికీ లాభాలు తెచ్చిపెట్టినవేం కాదు కానీ, ఆయన హోల్డ్ చేస్తున్న కంపెనీలనే ముద్ర పడితే చాలనుకునే ట్రేడర్లకు కొదవేం లేదు.

 

మరి అలాంటి వారి కందరికీ..ఇప్పుడు మంగళవారం నుంచి ఓ శూన్యమే కన్పిస్తోంది. భారత్ స్టాక్ మార్కెట్లపై అపరిమితమైన నమ్మకం కలిగినవారందరికీ బిగ్ బ్రదర్‌- రాకేష్ ఝన్‌ఝన్‌వాలా, టెక్నికల్స్, ఫండమెంటల్స్ పక్కనబెట్టి గుడ్డిగా రాకేశ్‌ని ఫాలో అవడమే తెలిసినవారికి, కొద్ది రోజులు మహా గడ్డుగా గడుస్తాయనడంలో సందేహమే లేదు

 

 

 

 

 

 

Comments