చెప్పినట్లే జరిగింది..ఆ స్టాక్ 10శాతం పెరిగింది


రిలయన్స్ పవర్ తనకి ఉన్న అప్పు


ల్లో సగానికిపైగా తీర్చబోతున్నట్లు ఉదయం

మనమో  కథనం ప్రచురించాం. అందులోని అంశాలకు తగినట్లుగానే ట్రేడర్లు

కూడా స్పందించగా..స్టాక్ రేటు ఇవాళ దాదాపు పదిశాతానికిపైగా ర్యాలీ చేసింది


ఇంట్రాడేలో రిలయన్స్ పవర్ షేర్లు రూ.12.65 వరకూ పెరిగాయి


రిలయన్స్ పవర్ సెప్టెంబర్ 2022లో రూ.1200 కోట్ల వరకు రుణాన్ని పొందేందుకు వెర్డే పార్ట్‌నర్స్‌తో ఒప్పందం

కుదుర్చుకుంది. ఆ డీల్ ప్రకారమే ఇప్పుడు ముందుకువెళ్తారని తెలుస్తోంది. జూన్ 2021లో వెర్డే పార్ట్‌నర్స్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రూ.550 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ అనేక ఇతర పవర్ కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉంది. రిలయన్స్ పవర్ ప్రతిపాదన ప్రకారం యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహా రుణదాతలకు రిలయన్స్ పవర్ రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉంది. విదర్బ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి విదేశీ కరెన్సీలతో పాటు దేశీయ కరెన్సీల్లో టర్మ్ లోన్స్ పొందింది. మార్చి 31, 2023 నాటికి రిలయన్స్ పవర్ మెుత్తం రుణ బకాయిలు రూ.2,216.43 కోట్లుగా ఉంది


స్టోరీ పబ్లిష్ అయ్యేటైమ్‌కి రిలయన్స్ పవర్ షేర్లు 9శాతంలాభంతో రూ.12.55 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments