రూ.100 డివిడెండ్ ఇస్తోన్న స్మాల్‌క్యాప్ కంపెనీ..లేడీస్ కి ఇది బాగా ఇష్టంకూడా

 రూ.100 డివిడెండ్ ఇస్తోన్న స్మాల్‌క్యాప్ కంపెనీ..రేటు తక్కువేం కాదు బ్రో



హాకిన్స్ పేరు వినే ఉంటారు..వంటగదితో  పరిచయంఉన్న మగవారికి బాగా తెలుసుది

అలానే లేడీసైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..కుక్కర్స్..స్టీల్‌కుక్ వేర్ కంపెనీ అయిన హాకిన్స్ మార్కెట్ 

కేపిటలైజేషన్ రూ.3376కోట్లుకాగా..జనవరి-మార్చి మధ్యలో రూ.253కోట్లకిపైబడిన ఆదాయం

ఆర్జించింది. ఇది గతేడాది ఇదే కాలంలో వచ్చిన 271.83కోట్లతో పోల్చితే  6.61శాతం తక్కువ

ఐతే లాభం మాత్రం 6.69శాతం పెరిగి రూ.22.80కోట్లుగా నమోదైంది.దీంతోపాటే

ఈపిఎస్ ఏకంగా రూ.43.12కి చేరగా...కంపెనీ తన షేర్ హోల్డర్లకు 1000 శాతం డివిడెండ్

అనౌన్స్ చేసింది. ఇది టెన్ రూపీస్ ఫేస్ వేల్యూతో కంపేర్ చేసినప్పుడు రూ.100గా అవుతుంది


ఐతే  ఈ డివిడెండ్ కంపెనీ నిర్ణయించిన అర్హులైన ఇన్వెస్టర్ల ఖాతాల్లో సెప్టెంబర్ 8లోపు జమ కానుంది. 

అంటే జూన్..జులై..ఆగస్ట్..దాదాపు ఈ స్టాక్ మోయాల్సిఉంటుంది. ఇక ఏడాది మొత్తానికి హాకిన్స్ కుక్కర్స్

ఆదాయం వేయి కోట్లుగా తేలింది.రూ.1000.59కోట్ల ఆదాయంపై రూ.94.78కోట్ల లాభం నికరంగా గడించిందీ 

కంపెనీ..

ఇవాళ్టి క్లోజింగ్‌లో అంటే మే 25నాటి ట్రేడింగ్‌లో హాకింగ్స్ కుక్కర్ షేర్లు రూ.6311 దగ్గర ముగిశాయ్

Comments