జూబిలంట్ ఫుడ్స్ క్యు4లో పూర్ పెర్ఫామెన్స్ చూపించడంతో...స్టాక్‌ని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పనిష్ చేస్తున్నారు

ఇంట్రాడేలో ఈ స్టాక్ ఇప్పటికే LCP రూ.481 నుంచి రూ.455.60కి పతనంఅయింది. ఐతే ఆ తర్వాత అనూహ్యంగా

కోలుకుని రూ.476కి పెరగింది



మే 17న కంపెనీ ప్రకటించిన రిజల్ట్స్ ప్రభావమే ఇదనేది ఎక్కువమంది మాట

 Q4లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లాభం 59.5 శాతం క్షీణతతో రూ. 47.5 కోట్లకు చేరుకుంది.

అలానే కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 8.2 శాతం పెరిగి రూ. 1,252.3 కోట్లకు చేరుకోగా, నిర్వహణ లాభదాయకతను కొలిచే EBITDA 

మాత్రం 12.9 శాతం క్షీణించి రూ. 252.2 కోట్లకు చేరుకుంది. దీనికి చీజ్, పిండి, ఫ్యాట్, ఆయిల్( నూనె) రేట్లు ఎక్కువగా ఉండటమే

కారణంగా తెలుస్తోంది. ఇందుకే  మార్జిన్ కూడా 25శాతం నుంచి 20.1 శాతానికి తగ్గిందని చెప్తున్నారు



ఈ తరుణంలో ప్రభుదాస్ లీలాధర్ స్టాక్ రేటుని రూ515కి పెంచడం విశేషం

మోతీలాల్ ఓస్వాల్ రూ.560టార్గెట్ ప్రైస్‌ని..షేర్ ఖాన్ బై రేటింగ్‌తో రూ. 600 టార్గెట్ ప్రైస్‌ని రికమండ్ చేశాయ్

Comments