52వీక్స్ ‌హై రేటుకి ఓఎన్‌జిసి, మార్కెట్ కేప్ అదుర్స్



మార్కెట్లలో ట్రెండ్ ఇవాళ్టికి నెగటివ్‌గా కన్పిస్తోంది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల ఇండెక్స్ ఒకశాతం 

వరకూ నష్టపోయింది. ఐనా కూడా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ షేర్లు మాత్రం

ఓపెనింగ్‌లోనే కేక పుట్టించేశాయ్. ఇంట్రాడేలో రూ.169 ధరకి చేరి తమ కొత్త 52వారాల గరిష్టధరని

సృష్టించాయ్.


నిన్నటి ముగింపు ధర రూ.167.05 కాగా, ఇవాళ కౌంటర్ వాల్యూమ్స్ భారీగా ఉన్నాయ్

ఏకంగా ఉదయం పదిగంటలకే 69లక్షల షేర్లు చేతులు మారాయ్. నిన్న ఈ సంఖ్య 89లక్షలు. ఈ ట్రేడింగ్ నంబర్లు చూస్తుంటే..తొందర్లోనే ఏదైనా మేజర్ న్యూస్ బ్రేక్ అవుతుందేమో అన్పిస్తోంది. 


మరోవైపు స్టాక్ మార్కెట్ కేపిటలైజేషన్ కూడా రూ.2లక్షల కోట్లు దాటడం విశేషం


కంపెనీ నిన్న తనకి వేలంలో దక్కిన అమృత్,మూంగా బ్లాక్‌లలో భారీగా చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. ఇది తాజా వార్త కాగా, స్టాక్ రేటు స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి 0.20శాతం నష్టంతో రూ.166.75 దగ్గర ట్రేడ్ అయింది 

Comments