ట్రైడెంట్‌కి పడిందయ్యా దెబ్బ...స్టాక్ 6% డౌన్



 నికరలాభం గూబలోకి జారడంతో...ట్రైడెంట్ లిమిటెడ్ షేర్లను ట్రేడర్లు

పనిష్ చేస్తున్నారు. ఇంట్రాడేలో ఈ స్టాక్ ఇప్పటికే 6శాతం పతనం అయింది. ఇంట్రాడేలో

రూ.32.10కి పడిపోయాయ్


క్యు4లో ట్రైడెంట్ కంపెనీ రూ.129.70కోట్ల లాభానికి మాత్రమే పరిమితం అయింది

ఇది నిరుడు ఇదే కాలంలోని లాభంతో పోల్చితే 28.4శాతం తక్కువ.దేశీయంగా

అమ్మకాలు లేక చతికిలబడుతున్న ఈ కంపెనీ విక్రయాలు..ఈ త్రైమాసికంలోనూ

అదే సమస్య ఎదుర్కొన్నది.  అందుకే అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 

దాదాపు 16శాతం తగ్గి రూ.1573.20కోట్లకి పరిమితమైంది


ఇక ఆపరేటింగ్ ఫ్రంట్ చూస్తే..ఎబిటా రూ.268.40కోట్లు కాగా..ఇది లాస్టియర్ ఫోర్త్ క్వార్టర్‌తో

పోల్చితే 20.50శాతం క్షీణించింది


కంపెనీ బోర్డు షేర్ హోల్డర్లకు 36 పైసల డివిడెండ్ ప్రకటించగా..షేరు ఇవాళ్టి ట్రేడింగ్‌లో

మరోవైపు కంపెనీ రూ.500కోట్లమేర నిధులను సమీకరించేందుకు ఎన్సీడీల జారీకి

ప్రతిపాదన చేయగా, వాటాదారుల అనుమతి ఇవ్వాల్సి ఉంది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ట్రైడెంట్ షేర్లు రూ.32.70 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments