కేక పుట్టిస్తోన్న మార్కెట్లు, 63వేలుదాటిన సెన్సెక్స్..

 మార్కెట్లు కొత్తవారాన్ని ఘనంగా ప్రారంభించాయ్. నిఫ్టీ ఓపెనింగ్‌లోనే లాంగ్ జంప్ చేసి

18608 పాయింట్లను దాటేసింది. ఇది నిఫ్టీ ఆల్‌టైమ్ సెకండ్ హై కావడం గమనించాలి. ఆ తర్వాతే

నిఫ్టీ ప్రస్తుత గరిష్ట స్థాయికి చేరింది. ఇంకో రెండు మూడు సెషన్లలో దాన్నికూడా అధిగమించడం

ఖాయంగా కన్పిస్తుండగా, సెన్సెక్స్ ఆల్‌టైమ్ హై స్థాయిని బ్రేక్ చేసి 62937 పాయింట్లకు

చేరింది. 63వేల పాయింట్లకు చేరిన అనంతరం తన పరుగుని అలుపు తీర్చుకునేందుకు ఆగింది



మార్కెట్ల లాభాలకు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తోంది. ఈ మూడు ఇండెక్స్‌లు

ప్రారంభమైన తొలి ఐదు నిమిషాలలోనే ముప్పావుశాతానికిపైగా లాభపడటం ట్రెండ్ ఎంత

బలంగా ఉందో  చెప్పడానికి నిదర్శనం


ఐతే ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల ఇండెక్స్ ఒకశాతం నష్టపోగా, హెల్త్‌కేర్ సెక్టార్ పావుశాతానికిపైగా

నష్టాల్లో ప్రారంభం కూడా గమనించాల్సి ఉంది. మెటల్,ఆటో స్టాక్స్ కూడా మంచి ఊపు ప్రదర్శిస్తున్నాయ్


మహీంద్రా అండ్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC,ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఒకటిన్నర నుంచి

మూడున్నరశాతం వరకూ లాభపడగా,  ఓఎన్‌జిసి, సన్‌ఫార్మా, దివీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్,హెచ్‌సిఎల్ టెక్

పావుశాతం నుంచి నాలుగుంబావు శాతం నష్టపోయాయ్

Comments