దౌడ్ తీస్తోన్న ఐషర్ మోటార్స్ 7శాతం లాభం

 


ఇవాళ ఆటో స్టాక్స్ స్పీడ్ మీద ఉండగా, ఐషర్ మోటర్స్ వాటిని ముందుండి నడిపిస్తోంది..కాదు కాదు దూసుకుపోతోంది

ఇంట్రాడేలో ఈ స్టాక్ ఇప్పటికే 7శాతం వరకూ లాభపడి రూ.3647 ధరకి చేరింది. మరో 200 రూపాయలు పెరిగితే

తన 52వారాల గరిష్ట ధరని అధిగమించే అవకాశం కూడా ఉంది


ఈ లాభాల దౌడుకు కంపెనీ నిన్న ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో మంచి నంబర్లు కన్పించడమే కారణం.

క్యు4 స్టాండలోన్ ప్రాఫిట్ రూ.905 కోట్లు దాటడంతో పాటు 48.50శాతం వృద్ధి నమోదు చేసింది

అలానే కార్యకలాపాల ఆదాయం 19.1 శాతం పెరిగి రూ.3,804.3 కోట్లకు చేరగా, కంపెనీ

తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ. 37 ప్రకటించింది. అంతకి మించి దశలవారీగా

మూలధన వ్యయం కింద రూ.1000కోట్లను ఖర్చు పెట్టబోతున్నట్లు కూడా కంపెనీ

అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే స్టాక్ ఇలా పరుగులు పెడుతోంది


నిన్నటి ముగింపు రేటు రూ.3405.30 కాగా..స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి ఐషర్ మోటర్ షేర్లు

రూ. 3600 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments