నష్టాలతో ఆరంభం..ఐషర్ మోటర్స్ అదిరిందిగా




 మార్కెట్లు వారంలో చివరి రోజున నష్టాలతో ప్రారంభం అయ్యాయ్ . నిఫ్టీ నిన్నటి ముగింపుతో పోల్చితే దాదాపు వందపాయిం ట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 300 పాయింట్లకిపైగా పతనమై 62వేల పాయింట్ల దిగువనే ట్రేడవుతూ..61800 పాయింట్లు 61500 పాయింట్ల దశకు దిగింది. తిరిగి 61700పైన ట్రేడవుతోంది


ఆటో,కన్జ్యూమర్ స్టాక్స్ మినహా అన్ని రంగాలూ నష్టాల్లోనే సాగుతుండగా, మెటల్ స్టాక్స్ ఒకటింబావు శాతం నష్టపోయాయ్. ఆయిల్ అండ్ గ్యాస్ ఒకశాతం, టెక్నాలజీ షేర్లు అరశాతం నష్టపోయాయ్.బ్యాంక్ నిఫ్టీ, ఐటీ పావుశాతం వరకూ నష్టాల్లో ట్రేడవుతున్నాయ్. 


ఐషర్ మోటర్స్, బజాజ్ ఆటో, టాటా మోటర్స్, హీరో మోటోకార్ప్, బ్రిటానియా ముప్పావు శాతం నుంచి ఐదుముప్పావుశాతం వరకూ లాభపడగా, బిపిసిఎల్, హిందాల్కో,దివీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్, ఎన్టిపిసి

ఒకటింబావు నుంచి రెండున్నరశాతానికిపైగా నష్టపోయాయ్

Comments