డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్‌కి రిజల్ట్స్ బూస్ట్, తీరిన ఆరేడు నెలల దరిద్రం

 



డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్‌కి రిజల్ట్స్ బూస్ట్
ఎయిర్‌పోర్ట్ లాంజ్ సర్వీసెస్ ఆగ్రిగేటర్, కార్డ్ సర్వీస్
ప్రొవైడర్ డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ షేర్లు గత రెండురోజులుగా
దంచి కొడుతున్నాయ్. దీంతో గత ఆరేడునెలల దరిద్రం కాస్తా
తీరిపోయేలా ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు సిరులు కురుస్తున్నాయ్

ఇంట్రాడేలో ఈ రోజు ఈ స్టాక్ మూడున్నరశాతం వరకూ లాభపడగా
రూ.581.50 వరకూ రేటు చేరింది. నిన్న ఈ స్టాక్ ఆల్‌టైమ్ హై రేటుకి
చేరింది. సెప్టెంబర్ 6న రూ.550  రేటుకిచేరగా..ఆ తర్వాత చాలామంది ఆ రేటులో
ఇరుక్కుపోయారు. అంతేకాదుస్టాక్ అలాట్‌మెంట్ ప్రైస్ రూ.326 కాగా..
ఆ స్థాయికి వరకూ దాదాపు పతనమైంది. తిరిగి 8 నెలల తర్వాత రూ.344 నుంచి
రిబౌండ్ అవడంతో..ఇన్వెస్టర్లు హుషారుకి పట్టపగ్గాలు లేకుండాపోయాయ్.

గత రెండురోజుల్లో 16శాతం..5 సెషన్లలో15శాతం, నెలరోజుల్లో 34శాతం లాభపడిన
డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ కంపెనీ గడిచిన త్రైమాసికంలో 25కోట్ల లాభం కళ్లజూసింది
ఇది లిస్టింగ్‌ కాకముందటి ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే 184శాతం ఎక్కువ
అంతేకాదు రెవెన్యూ పరంగానూ 140శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం జనవరి
ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.237.70కోట్ల ఆదాయం గడించింది
ఎబిటా రూ.34కోట్లుగా నమోదు కాగా..ప్రస్తుతం ఇన్వెస్టర్లు షేరు అందించిన
లాభాలను పిండుకునే పనిలో పడ్డారు

స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి డ్రీమ్‌ఫోక్స్ షేర్లు రూ.570.60 దగ్గర 
ట్రేడ్ అయ్యాయ్


Comments


  1. Thanks for covering most of your experience in blog. Sure this will be very useful for those needed.

    Latest News Updates

    ReplyDelete

Post a Comment