బయోకాన్ నికరలాభంలో జంప్..స్టాక్ కూడా డిటో

 





బయోకాన్ షేర్లు ఇవాళ ట్రేడింగ్ ఆరంభం నుంచి మంచిఊపు మీద ఉన్నాయ్. ఇంట్రాడేలో స్టాక్

8శాతానికిపైగా లాభపడిరూ.260.60 ధరని తాకాయి.


క్యు4లో కంపెనీ లాభం 31శాతానికి పైగా ఎక్కువ వృద్ధి నమోదుచేయడమే ఇందుకు కారణం

2022 ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికంలో కంపనీ లాభంతో పోల్చితే 31 శాతం పెరిగి

రూ.313.20కోట్లుగా నమోదు అయింది. ఇక రెవెన్యూ పరంగానూ డ్రగ్ కంపెనీ అమ్మకాలు

56.7శాతం పెరిగి రూ.3773.90కోట్లకి చేరాయ్


బయోసిమిలర్ బిజినెస్ మొత్తం వ్యాపారంలో 56శాతంగా నమోదు కాగా, ఇమ్యూనోసప్రసెంట్స్ సెగ్మెంట్

యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్లు, జెనెరిక్ ఫార్ములేషన్  వ్యాపారం అన్నీ కలగలిపి మంచి వృద్ధికి దోహదపడ్డాయని

కంపెనీ నిన్న ప్రకటించింది.


కంపెనీ ఎబిటా మార్జిన్లు కూడా 26.4శాతానికి పెరగడం విశేషం

Comments