హిందాల్కో ప్చ్...బొత్తిగా పరిస్థితి బావోలేదు



హిందాల్కో ప్రకటించిన నాలుగో త్రైమాసికపు ఫలితాలు నిరాశపరచడమేకాదు..ఇప్పట్లో ఈ మెటల్ స్టాక్ పెర్ఫామెన్స్‌పై 

ఆశలు పెట్టుకోవద్దన్నుట్లుగా ఉన్నాయ్.  2023 జనవరి-మార్చి మధ్యలో కంపెనీ రూ.2,411 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.3,851 కోట్లుగా ఉంది. అమ్మకాలు నిలిచిపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా క్యూ-4లో ఆదాయం రూ.55,857 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే కేవలం పావుశాతం మాత్రమే ఎక్కువ. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 0.16శాతం.


కంపెనీ షేర్ హోల్డర్లకు రూ.3 డివిడెండ్ ప్రకటించడం ఒక్కటే ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే విషయం


ఐతే అమెరికా బేస్డ్ నోవెలిస్ , అనిశ్చితి ఉన్న పరిస్థితుల్లోనూ చక్కగా వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేసిందని సతీష్ పాయ్ చెప్పుకొచ్చారు. ఈయనెవరంటారా..కంపెనీ ఎండి..ఆయన మాటల్లో చెప్పాలంటే, కంపెనీ డెట్ ఫ్రీగా మారిన తర్వాత సిచ్యుయేషన్ చక్కగా ఉంటుంది. నోవెలిస్ ఒక్కదాని వ్యాపారమే 4.4 బిలియన్ డాలర్లుగా ఉంటడం గమనించాలి. ఆదిత్య బిర్లాకు చెందిన ఈ కంపెనీ మన దేశంలో అల్యూమినియం ఉత్పత్తిలో నంబర్ వన్ కంపెనీ,  అలాగే ప్రపంచంలో ఫ్లాట్ రోల్ ఉత్పత్తులు, అల్యూమినియం రీసైక్లింగ్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతోంది. నిన్నటి మార్కెట్‌లో షేరు  రూ.406.95 దగ్గర క్లోజ్ అయింది

Comments