పెద్ద నోటు మరోసారి రద్దు...ఎవడికోసంగురూ...



తుగ్లక్ అని ఓ మొఘలాయీ చక్రవర్తిఉండేవాడు..తాను తీసుకున్న నిర్ణయాలను

తానే వెనక్కి తీసుకోవడంలోనంబర్ వన్ కావడంతో...ఈ రోజుకీ ఆ ఖాన్‌దాన్‌లో ఎవరికీ లేనంత

గుర్తింపు తెచ్చుకున్నాడాయన. ఎన్ని మంచి పనులు చేసినా సరే...తుగ్లక్ నిర్ణయం అంటే..ఓ పిచ్చి

నిర్ణయం కింద నానుడిలా మారిందంటే అది ఆయన చేసిన పనుల వల్లనే


రూ.2వేల నోట్లను దాదాపు రద్దు చేస్తున్నట్లు కాసేపటి క్రితం ఆర్బీఐ ప్రకటించింది. దీనిపై లెక్కల  కోసం

అవీ ఇవీ శోధించనక్కర్లేదు. 2016లో నోట్ బందీ చేసినప్పుడు చలామణీలో ఉన్న సొమ్ములోని అవినీతి డబ్బు

బ్లాక్ మనీ అంతా వ్యవస్థ బైటే ఉండిపోతుందని..ఉగ్రవాదానికి కోరలు పీకుతామని..నకిలీ నోట్లకి చెక్ పడుతుందని

డిజిటల్ కరెన్సీ కోసమని...రకరకాల వాదనలతో దేశాన్ని రోడ్డు మీదకు లాగి...క్యూల్లో నిలబెట్టారు..దాన్ని వ్యతిరేకిస్తే

దేశద్రోహులుగా ముద్ర వేసారు. మరి ఫలితం గురించి మాట్లాడితే బూతులు వస్తాయంటే అతిశయోక్తికాదు..పైగా దేశ ప్రధానే

ఈ లక్ష్యాలు,,కష్టాలు 50రోజుల్లో తీరకపోతే..ఉరేయండంటూ హుంకరించారు కూడా...మరి..తర్వాత చూసారు కదా..!


రూ.15.41లక్షలకోట్లు ధనం రూపంలో సర్క్యులేషన్ లో ఉంటే...15.31లక్షలకోట్లు బ్యాంకుల్లోకి వచ్చిచేరింది..మరి బ్లాక్ మనీ ఎక్కడకుపోయింది..?


తాజాగా...రూ.2వేల నోట్లు సర్క్యులేషన్లో ఉవ్న మొత్తం 3లక్షల పాతికవేలకోట్లుగాచెప్తున్నారు...మరిప్పుడు  ఎంత బ్యాంకులకు వచ్చిచేరుతుంది..

ఖచ్చితంగా మొత్తం వచ్చి తీరుతుంది..మరి ఈసారి ఈ నోట్ బందీకి లక్ష్యం ఏంటో  చెప్పగలరా,,


మే 23 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ మార్చుకోవచ్చు...ఒకవ్యక్తి పదినోట్లనుమాత్రమే మార్చుకోవాలి..(ఒకసారికి) అంటూ నిబంధనలను

పెట్టడం వెనుక పరమార్థం ఏంటి..? ఏ లక్ష్యంతో ఈ నోట్లబందీకి తెరలేపారనేదానికి జవాబు చెప్పాలి


.నిర్ణయం రావడం ఆలస్యం వెంటనే హేహే నా వల్లనే వచ్చింది..నేనే చేసా అనే లీడర్లను వదిలిపెడితే..గత నోట్ల రద్దుపైనే సుప్రీంకోర్టులో ఇంకా విచారణలు జరిగి...చివరకు

ఇప్పుడు మేం కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా అన్నారు..మరి ఈతాజా నిర్ణయంపై ఖచ్చితంగా ప్రభుత్వం జవాబు చెప్పి తీరాలి...ఇది సామాన్యుడిపై

భారం కాదు..మధ్యతరగతివాళ్లపై ప్రభావం పడదు..లాంటి రొటీన్ డైలాగ్స్ కాదు...అసలు ఇలాంటి పెద్ద నిర్ణయాలను ఎవరు తీసుకోవాలి..ఇనిషియేట్

చేసిందెవరు...ఈ మౌలికమైన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా..పొలిటికల్ మైలేజీ కోసం ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చడం సరైన పని

కాదు

Comments