ఎల్ఐసి హోల్దింగ్ వేల్యూ పెరిగింది బాసూ...అదానీ దయ




 అదానీ గ్రూప్ స్టాక్స్‌లో GQG మాత్రమే కాదు..మన పాలసీ బేహ్మాత్ ఎల్ఐసి కూడా

నమ్మకం మరింత పెంచుకున్నట్లుంది. అందుకే తిరిగి వాటా పెంచుకునేందుకు రెడీ అయిందంటున్నారు

ప్రస్తుతం కంపెనీ షేర్ల విలువ ఏప్రిల్ నుంచి రూ.6200కోట్లు పెరిగి రూ.45,481కోట్లకి చేరింది. ఈ హోల్డింగ్

వేల్యూ అదానీ స్టాక్స్ రేటుని బట్టి పెరుగుతుంది..తగ్గుతుంది. ఐతే ప్రత్యేకించి ఈ గ్రూప్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు

ఎల్ఐసి వైఖరి సందేహాస్పదం అయింది.


నెలరోజుల్లో వంద బిలియన్ డాలర్ల మార్కెట్ కేపిటలైజేషన్ కోల్పోయిన అదానీ..తిరిగి ఇప్పుడు విజృంభిస్తోంది.

హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అనేది పక్కనబెడితే..అది వేసిన ప్రశ్నలు ఇప్పటికీ అలానే ఉన్నాయ్

ఐతే ఈలోపున మాత్రం బారీగా నష్టం వాటిల్లింది..తిరిగి ఇప్పుడు స్టాక్స్ రేటు పెరిగినా..మధ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు

( వార్తలతో కంపితులై..స్టాక్స్ వదిలిపెట్టినవాళ్లు..భారీ నష్టాలను ఎదుర్కోలేనివారు, కాంట్రాక్ట్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టినవారు)

మునిగిపోయారు

ఇప్పుడు అదానీ ఎంటర్‌ప్రైజెస్ 52వీక్స్ లో లెవల్ నుంచి 159శాతం రికవర్ అయింది. అదానీ పోర్ట్స్ హిండెన్ బర్గ్ రిపోర్ట్ బైటికి

రాని ముందు రోజుల స్థాయికి చేరింది.దానికి తోడు గత మూడు సెషన్లలో గ్రూప్ స్టాక్స్ మరీ రెచ్చిపోయి లాభపడ్డాయ్


ఈ నేపథ్యంలోనే ఎల్ఐసికి అదానీ గ్రూప్‌లో ఉన్న వాటాల విలువ పెరగడంతో పాటు..స్టేక్ పెంచుకునే వ్యూహంపై కూడా

అంచనాలు మొదలయ్యాయ్

Comments