దడదడలాడించిన న్యూక్లియస్‌సాఫ్ట్

 








గడచిన ఆర్థికసంవత్సరంతాలుకూ చివరి త్రైమాసికంలో మంచి లాభం

కళ్లచూడటంతో...న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ లాక్ చేశాయ్. అది కూడా

20శాతం..! ఇంట్రాడేలో రూ.971.15ధరకి చేరి అక్కడే అతుక్కుపోయాయ్. ఇది ఈ స్టాక్‌కి కొత్త

52వారాల గరిష్ట ధర కూడా..!


కంపెనీ ఎక్స్‌పోర్ట్స్ తో నాలుగో త్రైమాసికంలో రూ.67.65కోట్ల లాభం ప్రకటించింది. ఇది గతంతో పోల్చితే

దాదాపు నాలుగురెట్లు ఎక్కువ.అలానే ఆపరేషనల్ రెవెన్యూ 25శాతం పెరిగి రూ.206.20కోట్లకిచేరింది


ఐతే ఇవాళ్టి ఈ జోరుకు మరో కారణం కూడా ఉంది. షేర్ హోల్డర్లకు ఒక్కోషేరుకు రూ.10 డివిడెండ్

అనౌన్స్ చేయడం కూడా ఈ కౌంటర్ అప్ సీల్ లాక్ చేయడానికి దోహదపడిందని చెప్పాలి


ఇయర్ టు డేట్ చూస్తే..న్లూక్లియస్ సాఫ్ట్‌వేర్ షేర్లు 145శాతం లాభపడ్డాయి

Comments