లోటస్ చాక్లెట్‌పై తగ్గని మోజు..మరోసారి అప్‌సీల్ లాక్

 




రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లోటస్ చాక్లెట్ కంపెనీలో మేజర్ షేర్ దక్కించుకున్న

తర్వాత వరసగా మూడోసెషన్ కూడా అప్ సీలింగ్స్ కంటిన్యూ అవుతున్నాయ్. దీంతో

సోమవారం ఓపెనింగ్‌లోనే  ఈ స్టాక్ రూ.160 దగ్గర లక్క వేసినట్లు అతుక్కుపోయింది


ఐతే ఈ కౌంటర్‌కి సంబంధించినంతవరకూ డేంజరస్ థింగ్ ఏమిటంటే..కౌంటర్ వాల్యూమ్స్

మరీ వందల్లో ఉండటమే..గత సెషన్‌లో 7వేల ట్రాన్సాక్షన్స్ జరగగా, నెల రోజుల సగటు

12వేలకి మించలేదు..రిలయన్స్ చేజిక్కించుకున్న తర్వాత కూడా ఇదే ఇంత తక్కువ సంఖ్యలోనే

ట్రాన్సాక్షన్స్ జరగడమంటే..షేర్లు ఓపెన్ మార్కెట్లలో చాలా తక్కువ ఉన్నట్లు లెక్క. ఈక్విటీ తక్కువ

మార్కెట్ కేప్ కూడా రూ.205కోట్లు మాత్రమే


ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ..ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే..ఒకప్పటి నటి..మూడు జాతీయ

ఉత్తమనటి అవార్డుల గ్రహీత...వెటరన్ యాక్ట్రెస్ శారదగారే ఈ సంస్థని స్థాపించారు. నష్టాలు రావడంతో..కొన్నేళ్ల

తర్వాత దాన్ని విక్రయించారు. ఇది రచయిత స్వయంగా 1990లలో పత్రికల ద్వారా తెలుసుకున్న విషయం. రిలయన్స్

కొనుగోలుకి సై అన్న తర్వాత చాలా యూట్యూబ్ ఛానళ్లు దీన్ని పాపులర్ చేశాయ్

Comments