హీందాల్కో డల్ బాసూ...




 గడచిన ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసికంలో హిందాల్కో నిరాశపరచడంతో..ఆ కంపెనీ షేరు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతోంది

ఇంట్రాడేలో 2శాతానికిపైగా నష్టపోయి రూ.399.20 దగ్గర ట్రేడ్ అయింది.

2023 జనవరి-మార్చి మధ్యలో కంపెనీ రూ.2,411 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.3,851 కోట్లుగా ఉంది. అమ్మకాలు నిలిచిపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా క్యూ-4లో ఆదాయం రూ.55,857 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే కేవలం పావుశాతం మాత్రమే ఎక్కువ. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 0.16శాతం.


కంపెనీ షేర్ హోల్డర్లకు రూ.3 డివిడెండ్ ప్రకటించడం ఒక్కటే ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే విషయం



స్టాక్ రూ.400.95 దగ్గర ట్రేడ్ అయింది

Comments