రిలయన్స్ పవర్ బాధితులకు గుడ్ న్యూస్

 రిలయన్స్ పవర్ స్టాక్‌లో హై రేటులో ఇరుక్కుపోయిన వారికి ఓ న్యూస్..ఈస్టాక్ ఏడెనిమిది నెలల క్రితం అనుకుంటా 

పాతిక రూపాయల వరకూ పెరిగింది. ఐతేఅప్పట్నుంచి కూడా కింది చూపులు తప్ప పైకెగిరింది లేదు..తాజాగా ఈ సంస్థకి 

ఉన్న భారీ అప్పు చెల్లించేందుకు అనిల్ అంబానీ స్కెచ్ వేసారు. ఇందుకోసం వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఆఫర్ ఇవ్వగా..దానికి  గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ వెర్డే పార్ట్‌నర్స్ అంగీకరించినట్లు సమాచారం. రిలయన్స్ పవర్ సెప్టెంబర్ 2022లో రూ.1200 కోట్ల వరకు రుణాన్ని పొందేందుకు వెర్డే పార్ట్‌నర్స్‌తో ఒప్పందం

కుదుర్చుకుంది. ఆ డీల్ ప్రకారమే ఇప్పుడు ముందుకువెళ్తారని తెలుస్తోంది


 జూన్ 2021లో వెర్డే పార్ట్‌నర్స్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రూ.550 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ అనేక ఇతర పవర్ కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉంది. రిలయన్స్ పవర్ ప్రతిపాదన ప్రకారం యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహా రుణదాతలకు రిలయన్స్ పవర్ రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉంది. విదర్బ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి విదేశీ కరెన్సీలతో పాటు దేశీయ కరెన్సీల్లో టర్మ్ లోన్స్ పొందింది. మార్చి 31, 2023 నాటికి రిలయన్స్ పవర్ మెుత్తం రుణ బకాయిలు రూ.2,216.43 కోట్లుగా ఉంది. కంపెనీ పవర్ ప్లాంట్లు 2019 నుంచి పనిచేయడం లేదు. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబైతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం 16 డిసెంబర్ 2019 నుంచి రద్దు చేయబడింది. అలా  ఈ పవర్ ప్లాంట్ నష్టాలతో దివాలా స్థితికి చేరుకోగా..తాజా పరిణామాలు

కాస్త జీవం పోసేలా  కన్పిస్తున్నాయ్...నిన్నటి ట్రేడింగ్‌లో ఈ స్టాక్ రూ.11.45 దగ్గర క్లోజ్అయింది

Comments