స్లో అండ్ స్టెడీ...విన్స్ ది రేస్‌ సూత్రాన్ని ఫాలో అయిన ఐటిసి

 



స్లో అండ్ స్టెడీ...విన్స్ ది రేస్‌ సూత్రాన్ని ఫాలో అయిన ఐటిసి..ఇప్పుడు స్టాక్ రేటు పరంగా రికార్డులు

బద్దలు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రకటించిన ఆర్థిక ఫలితాలు కూడా అదరగొట్టాయి. ఓ వైపు ద్రవ్యోల్బణం

ఇతర ఉత్పత్తుల ధరల పెరగడం, వంటి సమస్యలు ఉన్నా సరే..అన్ని విభాగాల్లోనూ మంచి వృద్ధి నమోదు చేసింది

క్యు4లో కంపెనీ రూ.5086.90కోట్ల లాభం  ప్రకటించింది.ఇది 2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోల్చితే

ఏకంగా 21.37శాతం ఎక్కువ.

కంపెనీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో రూ.17,224 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో సిగరెట్ బిజినెస్ నుంచి ఆదాయం రూ.7,355.83 కోట్లుగా ఉంది. FMCG విభాగం సంవత్సరానికి రూ.4,944.95 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఇదే సమయంలో హోటల్స్ సెగ్మెంట్ ఆదాయం సంవత్సరానికి రూ.781.71 కోట్లకు చేరుకుంది. అలాగే వ్యవసాయ-వ్యాపారం విక్రయాలు రూ.3,578.60 కోట్లకు పడిపోయాయని నివేదించింది. ఇక పేపర్‌బోర్డ్ విభాగం ఆదాయం రూ.2,221 కోట్లుగా నమోదు కావడం..కంపెనీ ఆఫ్టర్ కరోనా..కన్సాలిడేషన్ స్టేజ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది


ఈ సందర్భంగా కంపెనీ కామెంటరీ చూస్తే, సవాళ్లతో కూడిన  వాతావరణం నేపథ్యంలో వ్యాపారం చేయడానికి కంపెనీ వ్యూహాలు ..బలమైన పనితీరును ప్రదర్శించేందుకు వీలుకల్పించినట్లు తెలిపింది.


చివరగా ఇన్వెస్టర్లకు  ఒక్కో షేరుపై రూ.9.50 డివిడెండ్ చెల్లించబోతున్నట్లు తెలిపింది. దీనికి మే 30 రికార్డు డేట్

Comments