గ్రీవ్స్‌కి గ్రీజ్ మరక..సబ్సిడీ వెనక్కివ్వాలంటూ ఆదేశాలు



గ్రీవ్స్ కాటన్ ఇంజనీరింగ్ కంపెనీకి చిక్కులొచ్చి పడ్డాయ్.అనుబంధ

సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యాంపియర్ పేరుతో  ఎలక్ట్రిక్ టూవీలర్స్ విక్రయిస్తుంటుంది

ఈ సంస్థ తనకి కేంద్రప్రభుత్వం నుంచి రూ.124కోట్లు తిరిగి కట్టాల్సిందిగా తాఖీదులు

పంపినట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే సబ్సిడీని ఈ సంస్థ గతంలో పొందింది.ఐతే

ఫేజ్డ్ మేన్యూఫేక్టరింగ్ ప్రోగ్రామ్ గైడ్‌లైన్స్‌ని అనుసరించి ఈ వాహనాలను తయారు చేయాల్సిఉంటుంది


తాజాగా యాంపియర్ బ్రాండ్ కింద తయారైన వాహనాలు ఈ విధివిధానాలకు లోబడి లేవని

కేంద్రం అంచనాకి వచ్చింది. అందుకే తాము గతంలో చెల్లించిన సబ్సిడీని వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా

ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో..గ్రీవ్స్ కాటన్ షేర్లు డౌన్ సర్క్యూట్ తాకినంత పని చేశాయ్

ఇంట్రాడేలో పదిశాతం పతనమై రూ.134.20కి చేరాయి. 


పైన ఎపిసోడ్‌లో చూస్తే..కేంద్రం తమకి రిక్వెస్ట్ చేసినట్లుగా కంపెనీ చెప్పుకోవడం విడ్డూరం..రూల్స్ కి లోబడి

తయారు చేస్తే సబ్సిడీ ఇచ్చే కేంద్రం..అవి తాము రూపొందించిన పాలసీని ఫాలో కాకపోతే..ఇచ్చిన రాయితీలను

తిరిగి కట్టాలని ఆదేశిస్తాయి లేదంటే కోరతాయి..అంతేకానీ కంపెనీ చెప్పినట్లు..రిక్వెస్ట్ చేయవు..కింద కంపెనీ

తమకి అందిన సమాచారంపై ఎలా వివరణ ఇచ్చిందో చూడండి


On May 26, Greaves Cotton Ltd announced that the Indian government has requested a subsidy of around Rs 124 crore, along with interest, from Greaves Electric Mobility Private Ltd (GEMPL) for violating the Phased Manufacturing Programme (PMP) guidelines.


దానికిందనే..మే 25న భారీ పరిశ్రమల శాఖ ఈ కంపెనీని FAME ఇండియా స్కీమ్ నుంచి డీరిజిస్టర్ చేస్తామని లేఖ రాసినట్లు కూడా గ్రీవ్స్ కాటన్

చెప్పుకొచ్చింది. 

In a letter dated May 25, the Ministry of Heavy Industries informed Greaves Cotton that it may deregister the company from the FAME India Scheme Phase II due to its failure to comply with the PMP guidelines. The ministry also directed Greaves Electric Mobility Private Ltd (GEMPL) to deposit all the incentives claimed, amounting to Rs 124 crore, along with interest, under the scheme. This deposit is subject to the submission of the required representation by GEMPL.

ఇంత జరిగితే..కేవలం కేంద్రం ఇచ్చిన రాయితీ వడ్డీతో సహా తిరిగి చెల్లించమంటే..దాన్ని విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకోవడం సరైన పద్దతి కాదు

ఐతే కంపెనీ తమ బోర్డు సభ్యులతో కలిసి కూర్చుని నోటీసులోని వివరాలపై చర్చించి, వచ్చిన ఆరోపణలపై ఓ సరైన పరిష్కారం కనుగొనేవిధంగా

చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇందులో మంత్రిత్వశాఖల్లోని అధికారులను కలవడం కూడా ఒకటిగా తెలుస్తోంది

చూద్దాం ఇదెలాంటి టర్న్ తీసుకుంటుందో..


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి గ్రీవ్స్ కాటన్ షేర్లు రూ. 135.30దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments