నెలరోజుల్లో నూటొక్కశాతం లాభం

 GE T&D ఇండియా షేర్లు ఇవాళ దంచికొట్టేశాయ్. ఇంట్రాడేలో  13 శాతం పెరిగి 52 వీక్స్ హై రేటు  రూ.237.90కి చేరాయి. ఈ నెల రోజుల కాలంలోనే

ఈ స్టాక్ 66 శాతం లాభం పంచడం విశేషం..ఇదే సమయంలో బెంచ్ మార్క్ పెర్ఫామెన్స్ 3.4శాతం 

మాత్రమే పెరిగింది



 భారీ విద్యుత్ పరికరాల తయారీ వ్యాపారం చేస్తోన్న జీఈ టిఅండ్ డి ఇండియా ఏప్రిల్ నెల నుంచిచూస్తే 

ఏకంగా నూటొక్కశాతం దంచిపారేసింది. ఐతే ఇలా అప్రతిహత జైత్రయాత్రకి ప్రత్యేకించి కారణం ఏదీ లేదని కంపెనీ

ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.  .


ఏప్రిల్ నెలలో ఈ స్టాక్ రేటు రూ.118.65 ఉండగా మార్చి 31 నాటికే రెట్టింపైపోయింది. ఐతే ఆ తర్వాత వెనుదిరిగింది


ప్రభుత్వం ప్రకటించిన కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్స్,కర్బనఉద్గారాలను సున్నాస్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్

చేపట్టడం కొన్నికంపెనీలకు కలిసి వచ్చేఅంశం కాగా, వాటిలోGE T&D ఇండియా కూడా ఒకటిగా చెప్తుంటారు.

Comments