ఇదో బ్రేకింగ్ న్యూసే మరి..ఆ దేశాల పెట్టుబడులకు ఆ ట్యాక్స్ రద్దు




మన దేశంలోని స్టార్టప్స్..అన్ లిస్టెడ్ కంపెనీలకు ఓ సూపర్ న్యూస్అందించింది కేంద్రం,  US, UK, ఆస్ట్రేలియా మరియు జర్మనీలతో సహా 21 దేశాల నుంచి

వచ్చే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేసింది. ఇలాంటి దేశాల"నిర్దిష్ట అధికార పరిధి" జాబితాను ప్రభుత్వం నోటిఫై చేసింది, ఇవి కొత్త పన్ను నుండి మినహాయింపు పొందుతాయ్. అయితే మన దేశానికి ఎక్కువగా సింగపూర్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ మరియు మారిషస్ వంటి దేశాల నుండి ఎక్కువ పెట్టుబడులు వస్తుంటాయ్..వాటికి మాత్రం ఈ లిస్టులో చోటు లేకపోవడం గమనార్హం


మన ఇండస్ట్రీ అంచనాలు లెక్కల ప్రకారం సింగపూర్, మారిషస్, యూఏఈ నుంచే సగం FDIలు వస్తున్నాయ్. మరి వాటికి ఇలాంటి మినహాయింపు

ఇవ్వకపోవడం ఆలోచించే విషయమే..దీంతో ఇది గుడ్ న్యూసా..లేక ఇంకేదైనా మతలబు ఉందా అనేది కూడా ఆలోచించాలి


మారిషస్ మరియు సింగపూర్‌లోని పెట్టుబడుల ద్వారానే మన దేశంలోకి డైరక్ట్ గానో..ఇండైరక్ట్‌గానే గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎంట్రీ ఇస్తుంటారు. చాలా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో

ఇలా జరుగుతోంది.అలానే  నాన్-స్పెసిఫైడ్ దేశాల్లో ఉన్న స్పెసిఫిక్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పివి)కి పన్ను నుంచి ఇమ్యూనిటీ లభిస్తుందా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు


.కేటగిరీ 1 విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు, పెన్షన్ ఫండ్‌లు మరియు విస్తృత-ఆధారిత పెట్టుబడి నిధులు వంటి నిర్దిష్ట వర్గాల పెట్టుబడిదారులకు ఇది ఓ ఇంటెరిమ్

లిమిటెడ్ రిలీఫ్‌గా అనుకోవచ్చు

అలానే  అటువంటి పెట్టుబడిదారులు కూడా ఏంజెల్-పన్ను మినహాయింపును పొందేందుకు నేరుగా పెట్టుబడి పెట్టడం లేదంటే,  పెట్టుబడి కోసం SPVలను ఏర్పాటు చేయడంవంటి మార్గాలు అన్వేషిస్తారనుకోవాలి.

గత శుక్రవారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్‌లతో సహా విదేశీ పెట్టుబడిదారులకు ఏంజెల్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇది దాని నెట్‌లోకి వచ్చే వాటికి అదనపు వాల్యుయేషన్ నిబంధనలను కూడా ఉంచింది.  ఈ క్రమంలోనే

తాజా నిర్ణయం వెలువడింది

Comments