జేకేటైర్స్ స్ట్రాంగ్ షో...ప్రాఫిట్ బుక్ చేసుకున్న ట్రేడర్స్



Q4లో లాభం, ఆదాయంలో అదరగొట్టిన జేకే టైర్స్ నుంచి ట్రేడర్లు కూడా అదే వేగంతో

లాభాలను పిండేసుకుంటున్నారు.దీంతో స్టాక్ 6శాతం వరకూ ధర కోల్పోయింది. ఇంట్రాడేలో

రూ.187.20 వరకూ షేరు ధర పతనం అయింది


నాల్గవ త్రైమాసికంలో, కంపెనీ స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ గతంతోపోల్చితే రెండు రెట్లు పెరిగి

రూ.112కోట్లకి చేరింది. దేశంలో టైర్లు ప్రత్యేకించి కంపెనీ తయారుచేసే రేడియల్ టైర్లకు డిమాండ్ స్ట్రాంగ్‌గా ఉండటమే

ఇందుకు కారణంగా తెలుస్తోంది. కంపెనీ మొత్తం ఆదాయం గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ.3320కోట్లు కాగా, ఇప్పుడది

రూ.3645కోట్లకి పెరిగింది.


గత మూడు నెలల్లో, స్టాక్ 23 శాతానికి పైగా లాభాలను పంచగా, ప్రస్తుతం కన్పిస్తోన్న అమ్మకాల ఒత్తిడి..ప్రాఫిట్ బుకింగ్‌కి

సంకేతమంటున్నారు..మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ కంపెనీస్..ఈ కంపెనీ స్టాక్‌కి బయ్ కాల్ ఇవ్వడం గమనించాల్సి ఉండగా

 గత మూడేళ్లలో, కంపెనీ  షేరు ధర రూ.50 నుంచి 190కి పెరిగింది.


స్టోరీ పబ్లిష్ అయ్యేటైమ్‌కి జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.188.90 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments