కూత పెడుతోన్న బంగారం...వై..?

 




రిజర్వు బ్యాంక్ దేశంలో రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో బులియన్ మార్కెట్లో ర్యాలీ నెలకొంటోంది. బ్యాంకుల్లో డిపాజిట్, ఎక్స్‌ఛేంజ్‌కి

ఇవాళ్టి నుంచి పరుగులు పెట్టడం ఖాయంగా కన్పిస్తుండగా, ఆల్టర్నేటివ్ పద్దతుల్లో కూడా వాటిని మార్చుకుంటారనే అనుమానాలు

వ్యక్తం అవుతున్నాయ్. ఈ నేపథ్యంలోనే బంగారం రేటు పరుగు పెడుతుందనే అంచనాలు ఏర్పడ్డాయ్ 


మోదీ సర్కార్ డీమానిటైజేషన్ పూర్తి చేసిన దాదాపు 7 ఏళ్ల తర్వాత రూ.2000 నోట్లను చలామణి నుంచి రిజర్వు బ్యాంక్ వెనక్కి తీసుకుంటామని

ప్రకటించింది.  నోట్లను వెనక్కి తీసుకోవటం కారణంగా ఏర్పడిన డిమాండ్ రేట్ల పెరుగుదలకు కారణంగా నిలుస్తోందని అనేక రాష్ట్రాల గోల్డ్ డీలర్లు 

చెప్తున్నట్లు బ్లూమ్ బర్క్ రిపోర్ట్ ఇస్తోంది. గోల్ట్ రేటు సేల్స్ రెండూ ఈ వారంలోనే స్పీడందుకున్నాయని  లక్నో చౌక్ సర్రాఫా మార్కెట్‌లో  వినోద్ మహేశ్వరి అనే

బులియన్ డీలర్ చెప్పడం గమనించాలి. ఐతే ఇక్కడ గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుందంటే...కేవలం..రూ.2వేలనోటుతో కొనేవాళ్లకి మార్కెట్ రేట్ కంటే పదిశాతం ఎక్కువగా

అంటగడుతున్నారనేదే ఆశ్చర్యకరమైన విషయం


ఉన్న రేటుకి ఎక్కువపెట్టి కొంటున్నారనంటే దానర్ధం అది బ్లాక్ మనీనే అనుకోవాలి.  మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 ప్రకారం లైసెన్స్ పొందిన జ్యువెలరీ షాపు యజమానులందరూ జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,000 నుంచి 66,000కి పెరిగినట్లు జైపూర్‌

నగర వ్యాపారులు చెప్తున్నారు. మరోవైపు హవాలా వ్యాపారులపై నిఘా ఉంచేందుకు కోల్‌కతా పోలీసులు బులియన్ మార్కెట్‌ల వద్ద నిఘా పెంచారు. తిరునెల్వేలిలోని తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు కండక్టర్లు ప్రయాణికుల నుంచి రూ.2,000 నోట్లను స్వీకరించకూడదని సర్క్యులర్ జారీ చేసింది. ఐతే ఆర్బీఐ నోట్లను మార్పిడి చేసుకోవచ్చని

చెప్తుండగా...ఇలాంటి ఆదేశాలు దానికి విరుద్ధమైనవే..! ఇక రేపట్నుంచి సిచ్యుయేషన్ ఎలా మారుతుందో చూడాలి

Comments