ఈ వారం మార్కెట్లకు ఇవే కీలక దిక్చూచిలు

 



మన ఇండియన్ ఈక్విటీల్లో రిజల్ట్స్ సీజన్ దాదాపు ముగిసనట్లే..గతవారంలో ఎప్ఐఐ,గ్లోబల్ క్యూస్‌తోపాటు వీటి ప్రభావం

కూడా మార్కెట్లపై ఉండగా..ఈ వారం ఆటో కంపెనీల సేల్స్.. మ్యానుఫ్యాక్చరింగ్ డేటాలాంటి మరో రెండు అంశాలు వాటికి జతకలిపి చూసుకోవాలి.కొంతమంది

క్రూడాయిల్..రూపీ ఎక్స్‌ఛేంజ్ వేల్యూ కూడా కొంతమేర ప్రభావం చూపుతాయంటున్నారు. ఇక కొత్త సిరీస్..కూడా ఇవాళ్టి నుంచే

ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.



మార్కెట్లు స్థూల డేటా, అమెరికా ఋణ చర్చలు,  సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశాలపై దృష్టి సారిస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. దాంతోపాటే నిఫ్టీ లైఫ్ టైమ్ హై చేరవచ్చనే అంచనాని కూడా ఖేమ్కా వేసారు. అమెరికా జాబ్ రిపోర్ట్ కాస్త ఆందోళన పరిచేలా

ఉన్నా..ప్రస్తుతానికైతే..నిఫ్టీ మంచి ఊపుమీద కన్పిస్తోంది. ఈ పాజిటివ్ వైబ్స్..బలంగా పని చేస్తే..ముందు ఆ సెంటిమెంట్ మార్క్ టచ్ చేసిన తర్వాతే

ఇతరత్రా టెక్నికల్ జోన్‌ల గురించి మాట్లాడుకోవచ్చనేది కూడా మరో సంభావ్యత ఉన్న పరిణామంగా చూడాలి


Comments