సెప్టెంబర్ మాత్రమే డెడ్‌లైన్ కాదు..RBI సిగ్నల్



రూ.2వేల నోటు ఎందుకు రద్దు చేస్తున్నామో నిన్న శక్తికాంతదాస చెప్పుకొచ్చారు. ఆ ప్రకారం చూస్తే..సెప్టెంబర్ 30 మాత్రమే కాదు

ఆ తర్వాత కూడా మార్చుకునే ఛాన్స్ ఇస్తారనిపిస్తోంది. ఎందుకంటే విదేశాల్లో ఉన్నవారికి ఈ గడువు చాలకపోవచ్చని..పొడిగించే ఛాన్స్ ఉందని

చెప్పడమే దీనికి కారణం..సో..జనం మరీ ఎక్కువగా వర్రీ అయిపోయి జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు


ఇదే సమయంలో దేశంలోని షాప్స్, వ్యాపారులు రూ.2000 నోట్లను కస్టమర్ల నుంచి తీసుకోకుండా నిరాకరించొద్దని RBI గవర్నర్ చెప్పారు

కానీ ఈపాటికే..రాష్ట్రాలే తమ బస్సుల్లో తీసుకోవద్దని చెప్తున్నప్పుడు వ్యాపారులు ఎందుకు ఊరుకుంటారు..ఖచ్చితంగా కమిషన్ పేరుతో

బాదుతారు. అలానే నోట్లు ముద్రిస్తున్నప్పుడు  సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందంటూ వస్తున్న వాదనను ఆయన కొట్టిపడేశారు. 2016లో నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.1000 నోట్లకు బదులుగా లిక్విడిటీ గ్యాప్ నింపేందుకు రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు దాస్ వెల్లడించారు. అయితే దానిని తీసుకొచ్చిన ప్రయోజనం పూర్తైనందున క్లీన్ నోట్ పాలసీ కింద తాజాగా ఉపసంహరించుకుంటున్నట్లు శక్తి కాంతదాస్ చెప్పారు..ఏ లక్ష్యం నెరవేరిందో మాత్రం ఎవరూ అడగలేదు..ఆయనా చెప్పలేదు

పైగా  అధిక విలువ కలిగిన నోట్లు ఎల్లప్పుడూ క్లోనింగ్, మోసానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అంటే తొందర్లోనే రూ.500కి మూడుతుందా..? ఏమో చెప్పలేం..!

Comments