మార్కెట్లు లాభంతో ప్రారంభం

 



మార్కెట్లు లాభంతో ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ 18720 పాయింట్ల

వరకూ పెరిగినా..అది చాలా కొద్ది స్థాయిలో మాత్రమే కదలాడుతుండటంతో

బ్రెడ్త్ నెగటివ్‌గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయ్


సెన్సెక్స్ 63వేల పాయింట్లపైకి చేరినా..అక్కడ  సస్టెయిన్ కాలేక కిందకు

జారుతోంది.


బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, ఐటీ ఇండెక్స్ పావుశాతం నష్టాల్లో

సాగుతోంది.బ్రాడర్ మార్కెట్లు పావుశాతం లాభంతో ఉండగా, ఎఫ్ఎంసిజి

హెల్త్ కేర్ స్టాక్స్ రాణించే పనిలో పడ్డాయ్. మెటల్స్,ఆయిల్ అఁడ్ గ్యాస్

పిఎస్ఈ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయ్


నిఫ్టీ స్టాక్స్‌లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరోమోటోకార్ప్

ఒకటిన్నరశాతం నుంచి రెండుశాతం లాభంతో టాప్ 5 గెయినర్లుగా ట్రేడవుతున్నాయ్.టిసిఎస్, బిపిసిఎల్

టాటా స్టీల్, ఎన్టిపిసి, గ్రాసిం ముప్పావు నుంచి ఒకటిన్నరశాతం నష్టాల్లో ట్రేడయ్యాయ్

Comments