ఒక్క పాయింట్ ముక్కలేకపోయిన నిఫ్టీ

 స్టాక్ మార్కెట్లు గురువారం రోజున ఓ మాదిరి నష్టంతో ముగిశాయ్. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు,  నిఫ్టీ 86 పాయింట్ల మేర నష్టపోయాయి. 

సెన్సెక్స్  కొత్త రికార్డులను సృష్టించినతర్వాత కూలాఫ్ అవుతుండగా..నిఫ్టీ ఒక్క పాయింట్ తక్కువగా 52 వీక్స్ హై మార్క్ దగ్గర్లో ట్రేడ్ అయింది. ఆ తర్వాత

18771 పాయంట్ల దగ్గర నిలిచింది. 


ఐటీ సెక్టార్ ముప్పావుశాతంనష్టపోగా, బ్యాంక్ నిఫ్టీ పావుశాతం నష్టంతో ముగిసింది.స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో

ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడింది. మరోవైపు అన్ని రంగాలూ నష్టాల్లోనే ముగియడం ఇవాళ్టి వీక్లీ ఆప్షన్ల ఎక్స్‌పైరీ డే హైలైట్


నిఫ్టీ ప్యాక్‌లో  దివీస్ ల్యాబ్స్, ఎల్ టి, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఐటీసీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇవన్నీ అరశాతం నుంచి

ఒకశాతంలోపే లాభపడగా, 

టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ రెండు నుంచి రెండున్నరశాతం వరకూ నష్టపోయాయ్.


Comments