ఇన్ఫోసిస్ ఖాతాలో మెగా డీల్




ఇండియన్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మేజర్ డీల్ ఒకటి సెట్ చేసుకుంది. డాన్స్కే బ్యాంక్ నుంచి

454 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ఒకటి దక్కించుకుంది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఒప్పందం కాగా

ఆ తర్వాత కూడా ఇది కొనసాగవచ్చు, అలానే డీల్ సైజ్ 900 మిలియన్ డాలర్లకి కూడా చేరే అవకాశాలు

ఉన్నాయ్. అంతే కాదు డాన్స్కే బ్యాంక్ కి సంబంధించిన సెంటర్‌ని ఇన్ఫోసిస్ ఇండియాలో

కైవసం చేసుకోనుంది. ఇందులో 1400మంది పని చేస్తున్నట్లు చెప్తున్నారు


డెన్మార్క్‌కి చెందిన డాన్స్కే బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసమే ఈ డీల్ కుదరగా, ప్రస్తుతం ఉన్న తరుణంలో

ఇత పెద్ద డీల్ కుదరడం విశేషంగా చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని

బ్యాంక్ కస్టమర్లకు త్వరితగతిన సేవలు..ఆధునిక మార్గాల్లో అందించడమే లక్ష్యంగా ఈప్రాజెక్ట్ ముందుకు సాగనుంది

ఈ మేరకు కంపెనీ సీఈఓ సలిల్ పారేఖ్ ఓ ప్రకటనలో ఇలా చెప్పగా..ఎక్స్‌ఛేంజ్‌లకు కూడా ఇదే సమాచారం ఇచ్చారు


ఇన్ఫోసిస్ షేరు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమై అక్కడక్కడే కదలాడుతుండగా..స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి 

రూ.1269.90 దగ్గర ట్రేడ్ అయింది

Comments