లాభాలయోధకి మరో కొత్త గరిష్టం


హెల్దీ ప్రాస్పెక్టివ్‌లో, ఆపరేషనల్ పెర్పామెన్స్ , రియాల్టీ డిమాండ్‌ని అందిపుచ్చుకునే సామర్థ్యం అన్నీ

కలిసిన సంస్థగా మాక్రోటెక్ డెవలపర్స్‌గా పేరుంది..లోథా డెవలపర్స్ పేరుతో వ్యాపారం చేసే ఈ కంపెనీ షేర్లు ఇవాళ  52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయ్

ఇంట్రాడేలో 5శాతం లాభంతో రూ.611.45 దగ్గర కొత్త 52వీక్స్ హై రేటు క్రియేట్ చేశాయ్


డెట్ రిడక్షన్..అప్పు తగ్గింపు ప్రక్రియలో ముందంజ వేయడంతో పాటు స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ వేల్యూ కూడా ఇన్వెస్టర్లకు

ఈ స్టాక్ ప్రామిసింగ్ బెట్‌ని చేసింది. అందుకే స్టాక్ రెండేళ్ల క్రితం రూ.769.30 దగ్గర 1:1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూఅయినా..

దగ్గర దగ్గర తిరిగి ఆ రేటుకు చేరుకుంది.నెలరోజుల కాలంలో స్టాక్ పెర్ఫామెన్స్ 27శాతం గెయిన్స్ ఇచ్చింది.


 రెసిడెన్షియల్ సెక్టార్‌లో ప్రీ-సేల్స్‌కు మార్చి 31, 2023 నాటికి దాదాపు రూ. 30,000 కోట్ల విలువైన ఇన్వెంటరీ ,

 FY24లో 10.6 మిలియన్ చదరపు అడుగుల కొత్త లాంచ్ పైప్‌లైన్ ఉంది.  ICRA అంచనా  ప్రకారం, 

MDL గణనీయమైన ల్యాండ్ పార్సెల్‌ (మార్చి 31, 2023 నాటికి 4,300 ఎకరాలు, ఇందులో 300 ఎకరాలు డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం రిజర్వ్ చేసి ఉన్నాయ్)

 అందుబాటులో ఉంది, ఇది భవిష్యత్తు ప్రాజెక్ట్ అభివృద్ధికి గణనీయమైన సామర్థ్యాన్ని అందిస్తాయని ఇక్రా తన నివేదికలో చెప్పింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి మేక్రోటెక్ AKA లోథా డెవలపర్స్ షేర్లు రూ. 600.25 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments