ఐకియో...లాభం దండుకోవయో

 




ఈ రోజే మార్కెట్లను పలకరించబోతున్న ఇకియో లైటింగ్ మంచి లాభాలను

అందించేసూచనలు పుష్కలంగా ఉన్నాయ్. ఐతే లిస్టింగ్ గెయిన్స్ 30శాతం దాటితే వెంటనే ప్రాఫిట్

బుక్ చేసుకోవాలంటూ అనలిస్టులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏ ఐపిఓకి రానంత క్రేజ్ ఈ ఇకియోకి వచ్చింది


ప్రీమియం ఎందుకంటే, కంపెనీ  బుక్ బిల్డింగ్ సమయంలో షేర్‌లకు డిమాండ్ మరియు దీర్ఘకాలికంగా వ్యాపారాదాయ అవకాశం ఈ రెండూ

సంస్థకిప్లస్ పాయింట్లు ..అందుకే ఇవాళ లిస్టింగ్ గెయిన్స్ కనీసం 25శాతం ఉండొచ్చనేది అంచనా. 


"IKIO IPOకి లభించిన అద్భుతమైన స్పందన , దాని ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే, సుమారు 30-35 శాతం వద్ద అప్‌సైడ్ లిస్టింగ్‌ను ఆశించవచ్చు , కంపెనీ ప్రస్తుత పనితీరు - వృద్ధి సామర్థ్యం ఈ లాభాలకు ఆలంబన" అనేది స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్- ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ అనుభవి మిశ్రా  మాట

ఇకియో  R&D , బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌పై ఫోకస్,, క్లయింట్‌లతో రిలేషన్ లాంగ్‌టర్మ్‌లో కూడా ఈ కంపెనీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయ్

నోయిడా-బేస్డ్  IKIO యొక్క  పబ్లిక్ ఇష్యూ జూన్ 6-8 మధ్య కాలంలో 66.30 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (QIBలు) రిజర్వు చేయబడిన భాగం 163.58 రెట్లు బుక్ చేయబడింది,  కంపెనీలో  దాని వాటాదారులు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 606.5 కోట్లను సమీకరించారు, ప్రైస్ బ్యాండ్  రూ. 270-285 మద్యలో ఉండగా

రూ.285 దగ్గర అలాట్ చేసారు.

Comments