ఫుల్ యాక్టివ్ గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, రీజన్ ఇదే

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్లు ఇవాళ ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాయ్. కంపెనీ

క్యాలిపైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేయర్ల ద్వారా ధనం సేకరించనుండటమే 

ఇందుకు కారణం. ఒక్కోషేరుకు రూ.29.38ని ఫ్లోర్ ప్రైస్‌గా బ్యాంక్ ఫిక్స్ చేసింది


గురువారం నాటి క్లోజింగ్ ప్రైస్ రూ.31.34 కంటే దాదాపు నాలుగున్నరశాతం డిస్కౌంట్‌తో కంపెనీ

క్యుఐపిని ఓపెన్ చేయగా ఎంతమేర ఇలా నిధులను సమకూర్చుకోనుందనేది మాత్రం చెప్పలేదు


దాదాపు వెయ్యికోట్ల వరకూ ఇలా సేకరించే ఛాన్స్ ఉంది. మోతీలాల్ ఓస్వాల్, HDFC సెక్యూరిటీస్, BOB కేపిటల్ మార్కెట్స్

IDBIకేపిటల్, సిస్టమేట్రిక్స్ ఈ QIPకి బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి బ్యాంక్ ఆప్ మహారాష్ట్ర షేర్లు రెండున్నరశాతం లాభంతో రూ.32.10 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments