జీఎంటర్‌టైన్‌మెంట్‌కి వాచిపోయింది...లేకపోతే అబ్బా కొడుకులు


సెబీ, సంస్థ ప్రమోటర్ సుభాష్ చంద్ర,పునీత్ గోయెంకాని బ్లాక్ చేయడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్

షేర్లు బ్లాస్ట్ అయ్యాయ్. ఇంట్రాడేలో 4శాతం నష్టపోయి రూ.182 వరకూ చేరాయ్. ఆ తర్వాత

కోలుకుని తిరిగి రూ.191 స్థాయిలో ట్రేడవుతున్నాయ్


సోనీ కంపెనీతో విలీనంలోని అవకతవకలు..తదితర అంశాలపై సెబీ ఫోకస్ పెట్టింది. అసలు ఈ మెర్జర్‌పై

అమెరికన్ కంపెనీ మొదట్నుంచి వ్యతిరేకంగా ఉంది. కొత్త బోర్డులో సుబాష్ చంద్ర..ఆయన కొడుకు

పునీత్ గోయెంకాకి ఎలాంటి పొజిషన్లు ఉండటానికి వీల్లేదని వాదించింది. ఐతే వాటిని పక్కనబెట్టి..

బోర్డ్ మీటింగ్స్ కూడా నిర్వహించకుండానే...ప్రక్రియపై రెండు సంస్థలు తమ మందబలంతో ముందుకెళ్లాయి

ఈ క్రమంలోనే తాజా పరిణామం తలెత్తింది..వేలకోట్ల ఫండ్స్ అక్రమంగా వాడుకున్నారనే ఆరోపణలు ఈ అబ్బాకొడుకులపై

ఉన్నాయ్..


షిర్పూర్ గోల్డ్ రిఫైనరీ సహా 13 సంస్థలకు చాలా ప్లాన్డ్‌గా...జీ  తాలుకూ షేర్ హోల్డర్ల సొమ్ముని రకరకాల రూపంలో వీళ్లు

మళ్లించారని ఆరోపణలు ఉన్నాయ్.  అసలు కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉన్నా కూడా...2019- 23 మధ్యకాలంలో షేరు ధర

రూ.600 నుంచి 200 రావడానికి కూడా ఈ ప్రబుద్దులే కారణమని కూడా అంటున్నారు

మరిప్పుడు జీ-సోనీ మెర్జర్‌పై ఈ వివాదం ఎలాంటి ప్రబావం చూపుతుందంటే..ఒకటి ఆలస్యంకావచ్చు..రెండోది..సోనీ కంపెనీ

స్పందనని బట్టి..తర్వాతి పరిణామాలు చోటు చేసుకోవచ్చు..!

Comments